ఫస్ట్ ర్యాంక్ చిచ్చు
రచన : మహేష్ కూర్పు : ఫణి 20 పైసలకి పుల్లైసు వచ్చే రోజులు అవి ....అరోజు కూడా ఎప్పటిలాగే మా నాన్నజేబులో నుండి కొంచెం చిల్లర కొట్టేసి అవసరానికి తీసుకోని, ఒక పుల్లైసు , 50 గోలీలు కొనుక్కొని ....మా ఇంటిపక్కన ఉన్న పరమేష్ గాడికి ఊరించుకుంటూ ..వాడి ఇంటి ముందే తిరుగుతున్నాను.... అది చూసివాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పుల్లైసు కోసం మారాం చేస్తే ....రెండుపీకింది ...హమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా నేను మా వీధి లో జరిగే గోలీలపోటీకి ప్రాక్టీసు చెయ్యొచ్చు ఎవరికైన గోలీల ఆట లో గెలుస్తాను అనే నమ్మకం లేకపోతే ....నాతో ఆడేవాళ్ళు....అదేంటో నేనంటే అంత అభిమానం అందరికి .....సాయంత్రం దాకా గోలీలు ఆడి..నా