ఫస్ట్ ర్యాంక్ చిచ్చు

                                                                                                                                        రచన    : మహేష్
                                                                                                                                        కూర్పు : ఫణి  

                                       20 పైసలకి  పుల్లైసు వచ్చే రోజులు అవి ....అరోజు కూడా ఎప్పటిలాగే మా నాన్నజేబులో నుండి కొంచెం చిల్లర కొట్టేసిఅవసరానికి తీసుకోని, ఒక పుల్లైసు , 50  గోలీలు కొనుక్కొని ....మా ఇంటిపక్కన ఉన్న పరమేష్   గాడికి ఊరించుకుంటూ ..వాడి ఇంటి ముందే తిరుగుతున్నాను....
                                                   అది చూసివాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి  పుల్లైసు కోసం మారాం చేస్తే ....రెండుపీకింది ...హమ్మయ్య  ఇప్పుడు ప్రశాంతంగా  నేను మా వీధి లో జరిగే గోలీలపోటీకి ప్రాక్టీసు చెయ్యొచ్చు
                                             ఎవరికైన గోలీల ఆట లో గెలుస్తాను అనే  నమ్మకం లేకపోతే ....నాతో ఆడేవాళ్ళు....అదేంటో నేనంటే అంత అభిమానం అందరికి .....సాయంత్రం దాకా గోలీలు ఆడి..నా ప్రత్యర్ధులకి నా గోలీలు అన్నీ సమానంగా పంచి ..కడుపులో ఆకలి రైలుస్టార్ట్ అయ్యే సరికి ఇల్లు గుర్తొచింది ....
              మానాన్న , నా కోసమే బెల్ట్  పట్టుకొని వరండాలో  కూర్చున్నాడు ...ఆది చాలదుఅన్నట్లు పక్కింటి సీత (నా క్లాసు మేట్) గట్టిగా మా నాన్నకి వినపడేలాగా...."రవీంద్రనాథ్ టాగోర్ గీతాంజలి రచించెను...రచించెను"  అన్ని తెలుగుపాఠం నా కోసమే  చదువుతోంది . ఈ రెండు జడల సీతకి ఎవరైనా శ్రద్దాంజలిరచిస్తే  బాగుండు అనిపించిది నాకు ....
               మా నాన్న నన్ను కొట్టరు      ..కొట్టినా గట్టిగా కొట్టరు అన్న positive attitude తోలోపలి కి వెళ్ళాను ....టేప్ రికార్డర్ ఆన్ చేసారు మా నాన్న ...పాటలువినటానికి కాదు ...నా అరుపులు బయటకి వినబడకుండా ఉండటానికి .....టేప్రికార్డర్ ఇలా కూడా వాడొచ్చు అని నాకు ఆ రోజే తెలిసింది ....కొడితేకొట్టారు కాని , మంచి పాట పెట్టారు ....గ్యాంగ్ లీడర్ సినిమాలో "bajjovobang bang"....గ్యాంగ్ లీడర్ లో  చిరంజీవి లాగా కాలర్ ఎగరేద్దాం అంటే....మా నాన్న నా కాలర్ వదలటం లేదు ....
                 పాటఅయిపోవచ్చింది....మంచి పాట ...రివైండు చేసి విందాం అని చెప్దాం అంటే ,వినే position  లో లేడు మా నాన్న ..ఆ లోపే రెండు జడల సీతా వచ్చింది.....మా నాన్న.. పాటనీ , మా చర్చలని pause లో పెట్టాడు ...
               "అంకుల్ , నేను మళ్లీ  క్లాసు లో ఫస్ట్ వచ్చాను , స్వీట్స్ తీసుకోండి " అంది సీత
               మీకు progess card  ఇచ్చారా సీతా ...మావాడు చూపిచలేదు మరి .....
     సీతా : ఎపుడో ఇచ్చారు అంకుల్ ...ఇచ్చి కూడా వారం  రోజులు అయింది ...
      ఏరా , progress card ఇచ్చారంట కదా , ఏం చేసావు రా ,చూపిచకుండా..  అన్నాడు మా నాన్న
     నిన్ననే ఆఖరి రోజు నాన్న గారు .....ఇచ్చేసాను వాళ్ళ card మనకి ఎందుకు అని  ..
    మరి సంతకం రా ... ఆశ్చర్యంగా అడిగాడు మా నాన్న ...
    ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా ......రోజంతా కష్టపడి వచ్చే మీకుఎందుకు మళ్లీ శ్రమ అని  నేనే పెట్టేసాను ...అయినా మా టీచర్ చెప్పిందినాన్న గారు , మీ ఫ్యామిలీ లో ఎవరైన సంతకం పెట్టొచ్చు అని....నేనూ మీఫ్యామిలీయే కదా అని పెట్టాను ....సంతకం పెట్టే ముందు అన్ని మార్కులు చెక్చేశాను ....total  కరెక్టే వేసారు టీచర్ గారు......
                               నా కోసం బెల్ట్ సరిపోదు అని లోపలి కి వెళ్లి ఏదో వెతుకుతున్నాడు మా నాన్న....
 అయినా నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తే మేము ఎందుకు స్వీట్ తినాలిసీతా.....అసలు నీ పేరు సీతా కాదు "సూర్యకాంతం మళ్లీ పుటింది" అని పెట్టాలి...వెళ్ళు మీ అమ్మ పిల్లుస్తుంది నిన్ను ...
                        సీతా :      మా అమ్మ ,నాన్న లేరు కదా ఇంట్లో ....నాకు ఫస్ట్ ర్యాంక్వచ్చింది అని మా చుట్టాలకి చెప్పడానికి 5 litres పెట్రోల్  కొట్టించుకొనిస్కూటర్ మీద  ఇపుడే ఊర్లోకి వెళ్లారు .....
                           అవునా ...అయినా 5th క్లాసు సెకండ్  unit test లో 1st ర్యాంక్ వస్తేనేఇంత సినిమా చూపిస్తున్నారు .ఫైనల్ exam లో 1st రంక్ వస్తే....మీ నాన్నవారోత్సవాలు చేస్తాడేమో .....
సీతా : మరి పిల్లకి encouragement ఇవ్వాలి కదా .....
 నేను: తెలుగులో దానినే ఆస్థి అమ్ముకోవటం అన్ని కూడా  అంటారులే ........మీనాన్న ఆస్థి నీ చేతిలోనే ఉంది సీతా ...అలోచించుకో ...నువ్వు ఇలాగే 10thదాక ఫస్ట్ ర్యాంక్ వస్తే  మీ నాన్న loan తీసుకోవాలి మరి celebrationsకి ....                                          
సీతా : అయ్యో ...ఏంటి  ఆ అచ్చు ....చేతి మీద ....
 నేను : అదా ...మూడు సింహాలు ...మా నాన్న పోలీసు కదా .....పోలీసు బెల్ట్ మీద ఉంటాయిలే
 సీతా : మరి నాల్గవ సింహం ఏది  .....
నేను : నాల్గవ సింహమే కదా ఈ మూడు  సింహాల అచ్చు గుదింది...
సీతా : అర్ధం కాలేదు ....
నేను : ఇది కూడా అర్ధం కాదు ...మళ్లీ ఫస్ట్ ర్యాంక్ కదా నువ్వు .....
సీతా : అయినా మంచిగా చదువుకోవచ్చు కదా ....
నేను: సీతా ...నువ్వు వద్దు అన్నా వచ్చావు  .....స్వీట్ ఇచ్చావు ....ఇష్టంలేకున్నా మైసూర్ పాక్ రెండు తిన్నాను ...నవ్వు రాకపోయినా నవ్వుతున్నాను.....ఈపాటికి నువ్వు వెళ్లిపోవాలి ...నువ్వు వెళ్ళిపోయాక  ...నీ దయవల్లఇంకో పాట వినాలి ఇప్పుడు .....వెళ్ళు వెళ్ళు ..వెళ్ళూ............
                   వెళ్ళే ముందు ఇంకో మైసూర్ పాక్ ఇచ్చి వెళ్ళు ....నాకు కాదులే, మా అమ్మ కి .....
సీతా : ఇందాక అంకుల్ కూడా ఆంటీకి అని తిసుకున్నారు రెండు ....
నేను: ఓహ్ అవునా ....మా నాన్న తీసుకుంది ....రేపు స్కూల్ లో ఇచ్చేస్తాను లే...ఇప్పుడు అయితే ఇచ్చే వెళ్ళు ....వెళ్లి 3rd  unit   test కి prepareఅవ్వు ....ఈసారి ఈ స్వీట్ కాకుండా పాలకోవా తీసుకోని రావాలి .....సరేనా ...
        సరే అంటూ వెళ్ళిపోయింది సీతా.....
        అమ్మ కి అని తీసుకున్న మైసూర్ పాక్ తిని , త్రేపుతూ వచ్చాడు  మానాన్న .....ఈసారి ఘరానా మొగుడు సినిమా లో "ఏందీ బే ఎట్లాగ ఉంది వొళ్ళు " పాట పెట్టాడు .....ఇంక పాటలు వినే ఓపిక లేక .....
        నాన్న ఈసారి 3rd unit test లో ఫస్ట్ ర్యాంక్ వస్తాను ఆది కూడా చట్టబద్ధంగా  ---ఇదే నా ఛాలెంజి ఛాలెంజి ఛాలెంజి
మా నాన్నకి డౌట్ వచ్చి ...ఏంటి రా ౩ సార్లు ఛాలెంజి అన్నావ్....ఏమైంది
ఛాలెంజి సినిమాలో చిరంజీవి అలానే చెప్తాడు లే ........
                                                ఛాలెంజి  గెలిచానో లేదో  ఇ సరి కలిసి నప్పుడు చెప్తాను ....ఎందుకు అంటేప్రతి సీన్ climax  లాగా ఉండాలి కదా ......
                                                         

Comments

  1. "నేను : నాల్గవ సింహమే కదా ఈ మూడు సింహాల అచ్చు గుదింది..."


    ర్యాంక్ వచ్చింది అని మా చుట్టాలకి చెప్పడానికి 5 litres పెట్రోల్ కొట్టించుకొని స్కూటర్ మీద ఇపుడే ఊర్లోకి వెళ్లారు


    హీ హి హి హిlarious!

    ReplyDelete
  2. నాల్గవ సింహమే కదా ఈ మూడు సింహాల అచ్చు గుదింది..
    ha ha ha......

    ReplyDelete
  3. chala bagundi, nijamga hilarious comedy,
    mahesh and phani ki mangideelu, keep rocking

    ReplyDelete
  4. good timing and comedy...chala bagundhi

    ReplyDelete
  5. chaDuvu vachina vallakante rani vallake creativity ekkuva untundi. may be nenu correct chesukovali. tannulu tinna vallaki.
    superb man!!!!!!

    ReplyDelete
  6. too good.............

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 4

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 1

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 3