New

Monday, April 19, 2010

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 4

                                                                                                                            రచన : మహేష్
                                                                                                                            కూర్పు : శ్రీరామ్

ఇవ్వాళ మా బస్సు రాకుంటే బాగుండు అని ఇలా అనుకున్నానో లేదో,అలా మా ఎయిర్ బస్సు (మా స్కూల్ బస్సు పేరు అది) వచ్చింది.పేరుకి మాత్రం ఎయిర్ బస్సు,కాని ఎర్రబస్సు కంటే దారుణం.బస్సు ఎక్కి డ్రైవర్ పక్కన కూర్చొని ఎలా డ్రైవింగ్ చేస్తున్నాడో చూస్తూ నేర్చుకుంటున్నాను. ప్రనిల్ గాడు వాడు ఏదో విహారయాత్రకి వెళ్తున్నట్లు రోడ్ మీద వెళ్ళేవాళ్ళకి టాటా చెప్తున్నాడు.అలా మా ఎయిర్ బస్సు మేకలని వధసాలకి తీసుకెళ్ళినట్టు మమ్మలిని స్కూలుకి తీసుకువెళ్ళింది.

క్లాసు లో మా తెలుగు టీచర్,"అందరు పుస్తకాలు క్లాసు బయటపెట్టి,బెంచికి ఇద్దరు చొప్పున కూర్చోండి.పరీక్షకి ఇంకా పది నిమిషాలే ఉంది".లాస్ట్ రెండు బెంచిలలో పరమేష్,ప్రనిల్,నేను,మధు కూర్చున్నాము. ప్రనిల్ గాడు టెన్షన్ పడుతున్నాడు.

నేను :ఏరా,ఎందుకురా టెన్షన్,ముందు ఫణి ఉన్నాడు,పైన దేవుడు ఉన్నాడు.వీరిద్దరి వల్ల కాకపోతే నీ వెనకాల నేను ఎలాగో ఉన్నాను కదా...

ప్రనిల్ :ఫణిగాడు చూపించకపోతే ఎలా రా....

నేను :చూపించాల్సిన అవసరం కూడా లేదు..మీ బెంచ్ మీద సగం answers,మా బెంచ్ మీద సగం answers ముందే రాసాము కదా...అవి చూసి రాయటమే...చూసి రాయటం వస్తే చాలు రా...

ప్రనిల్ :సర్ చూస్తే రా...దొరికిపోతే

నేను : అందుకే పెన్సిల్ తో రాసాము ....సర్ చైర్ లోనుండి లేచి వచ్చేలోపే మనం చేతితో చెరిపితే చెరిగిపోతాయి....ఇప్పుడు నువ్వు ఆ ఏడుపు ఫేస్ మార్చు,లేకుంటే ఇప్పుడే దొరికేలాగా ఉన్నాం.
ఈలోపే మా సర్ "ఏంటి రా మహేష్,ఏంటి మాటలు అక్కడ...లేచి ఇలా రా నువ్వు..ఇక్కడ ఫస్ట్ బెంచ్ లో కూర్చో వచ్చి..."

నేను : సర్,అంత పని చేయకండి,ఇంక మాట్లాడను సర్...

మా సర్ :నువ్వు ఇప్పుడు వస్తావా,లేక నన్ను రమ్మంటావా అక్కడికి ....

ప్రనిల్ :ఒరేయ్,వెళ్ళరా,లేకుంటే సర్ వస్తే అందరం దొరికిపోతాం

నేను :నీకేంటి రా..ఇప్పుడు ఎన్నైనా చెప్తావు...

మా సర్ :ఏరా మహేష్ ,వస్తున్నావా లేదా....

నేను : ఆ... వస్తున్నాను సర్ .
ఫస్ట్ బెంచిలో సీత పక్కన కూర్చోబెట్టాడు మా సర్ నన్ను.....సీత నన్ను చూస్తూ ఒక వెకిలినవ్వు నవ్వింది.

సీత: ఏదైనా ప్రశ్నకి సమాదానం తెలియకపోతే అడుగు ...చూపిస్తాను

నేను :నువ్వు ఏంటి చూపించేది బోడి ...కావాలంటే నేనే నీకు చూపిస్తానులే

సీత: నీకు రావు అని కాదు కాని ...టైంకి గుర్తుకు రాకపోతే అడుగు అని నా ఉద్దేశం...

నేను :నీ ఉద్దేశాలు,ఉపన్యాసాలు నాకేమి వద్దుకాని....అంతగా నాకు రాకపోతే రాయకుండా ఖాళీ పేపర్ ఇచ్చేసి వెళ్తాను కాని నిన్ను మాత్రం అడగను......

పరీక్ష మొదలయింది.ప్రశ్నలే రెండు పేజీలు ఉన్నాయి.వీటికి జవాబులు ఎన్ని పేజీలు రాయాలో.ఆ ప్రశ్నలు చూసి నా తప్పు నేను తెలుసుకున్నాను...సీత మళ్లీ ఒకసారి అడిగితే బాగుండు..ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతా.ఏం చేయాలో తెలియక వెనక్కి తిరిగి చూశాను.అందరు ఏదో రాస్తూనే ఉన్నారు.ప్రనిల్ గాడు మాత్రం బెంచీ చూస్తూ పేపర్ మీద రాస్తున్నాడు.మనిషి అనే వాడికి ఎవడికైన అనుమానం వచ్చేలాగా చూసి రాస్తున్నాడు వాడు.మా తెలుగు సర్ చూడటానికి మనిషి లాగా లేకున్న మనిషే.అనుమానం వచ్చింది.కుర్చీ లో నుండి లేచి ప్రనిల్ వైపు వెళ్ళాడు.ప్రనిల్ గాడు ఏమాత్రం జంకకుండ,కనీసం తలెత్తి చూడకుండా బెంచీ మీద పెన్సిల్ తో రాసిన ఆన్సర్ ని పేపర్ మీద పెన్ తో రాస్తున్నాడు.

మా సర్ :ఏరా ప్రనిల్,అడీషనల్ పేపర్ ఏమైనా కావాలా రా?

ప్రనిల్ గాడు చికాకుగా తలకాయి పైకెత్తి చూసేసరికి కుర్చీ లో ఉండాల్సిన సర్,కళ్ళముందు ఉండే సరికి వాడి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

ప్రనిల్ :నాకు ఏమీ సంబందం లేదు సర్.మహేష్ గాడు మధుగాడి పెన్సిల్ తో పరమేష్ గాడి బుక్ చూసి నా బెంచ్ మీద రాసాడు .

సర్ :నువ్వు ఏం చేస్తున్నావ్ మరి.దాన్ని చూసి రాస్తున్నావా...

ప్రనిల్ :లేదు సర్ నేను రాసేది,వాళ్ళు రాసింది ఒకేలాగా ఉందో లేదో చూస్తున్నాను సర్ అంతే.

వాడు చూసి రాసినందుకు మా సర్ కి కోపం రాలేదు గాని వాడి మాటలికి కోపం వచినట్లు ఉంది.వాడి నెత్తి మీద రెండు మొట్టికాయలు వేసి మా బెంచ్ ముందు కింద కూర్చుబెట్టారు మా సర్.ఆది చూసి నాకు తెగ సంబరమేసింది.నవ్వుతూ నవ్వుతూ కింద పేపర్ చూస్తే మళ్లీ భయం మేసింది.ఏదో ఒకటి రాద్డమని పేపర్ మీద పెన్ పెట్టాను.ఆలోపే సీత అడీషనల్ కోసం అడిగింది.ఈ పిల్లని మార్చడం నావల్ల కాదు.

"పరిక్షలో బాగా మార్కులు రావాలి అంటే,భావం కాదు ఆన్సర్ షీట్స్ బరువు పెంచాలి" అని మా శ్రీరామ్ గాడి మాటలు గుర్తొచ్చాయి.ఫెయిల్ అయిన పరీక్ష కి కూడా టాపర్ కన్నా ఎక్కువ ఎడిషనల్స్ తీసుకున్న హిస్టరీ వాడిది.పేపర్ కి పైన,కింద రెండు పక్కల మూడు సెంటిమీటర్ల మార్జిన్ కొట్టాను.ఇప్పుడు రాయాలిసిన డబ్బా చిన్నగా అయింది.పేజీకి చివరిన (P.T.O)అని రాశాను.ఇప్పుడు నేను ఒక పది లైన్లు రాస్తే పేజీ నిండినట్లే.పది లైన్లు కూడా రెండు పేరాగ్రఫులు రావాలి.ఆ పది లైన్స్ ఎలాగో సీత పేపర్ లో కనబడుతూనే ఉన్నాయి.నేను ప్రనిల్ లాగా కాకుండా ఒక కన్ను నా పేపర్ మీద ఇంకొక కన్ను సీత పేపర్ మీద పెట్టి చక్కగా చిన్నగా రాశాను.

సీత: ఏంటి మహేష్,ఆన్సర్స్ గుర్తుకురావటం లేదా.చూపించాలా

నేను   : అన్ని రాశాను కానీ ఆ రెండవ ప్రశ్న గుర్తుకు రావటంలేదు సీత.నువ్వు రాసావా..
సీత : ఆ రాశాను.ఇదిగో పక్కన పెడతాను...చూసి రాసుకో....

నేను  : చూసి రాయనులే...నేను రాస్తూ..మధ్యలో ఎక్కడైనా గుర్తుకురాకపోతే అప్పుడు చూస్తాను..
సీత : ఓకే...ఐతే ఇప్పుడు వద్దు కదా..
నేను  : పర్లేదు లే...ఉంచు...మొదటి లైన్ కూడా గుర్తుకురావడం లేదు ఏంటో...

పరీక్ష అయిపోయింది.ఈ పద్ధతినే అన్ని పరీక్షలకి పెట్టాను.కాకపోతే మూడు సెంటిమీటర్లు కాకుండా ఐదు సెంటిమీటర్లు మార్జిన్ కొట్టాను .పరిక్షలు అయిపోయాయి.పరీక్షలకి పడిన కష్టం మరిచిపోయే లోపే సెలవలు అయిపోయాయి.సెలవలు తర్వాత మొదటి రోజు స్కూల్ కి వెళ్ళాలంటే భయం.ఎందుకంటే ఆరోజే ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తారు కాబట్టి.ఆ రోజు లాస్ట్ అవర్ లో క్లాస్ కి మా హెడ్ మాస్టర్ వచ్చారు ప్రోగ్రెస్ కార్డ్లు ఇవ్వడానికి.అందరి పేర్లు చదువుతూ ఇస్తున్నారు.నేను తెలివి గా బెంచ్ కింద దాక్కున్నను.రెండు సార్లు నా పేరు పిలిచారు మా హెడ్ మాస్టర్.పలకకపోయే సరికి ఆబ్సెంట్ అనుకొని పక్కన పెట్టేశారు.స్కూల్ నుండి ఇంటికి వెళ్లేసరికి ముందు గదిలో సీత కనిపించిది.స్వీట్ బాక్స్ తో....

మా నాన్న : ఏరా ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారంట కదా నీ ప్రోగ్రెస్ కార్డ్ ఏది రా...
నేను : ప్రోగ్రెస్ కార్డ్ ఆ....ఇవ్వలేదు నాన్నగారు....
సీత: ఇచ్చారు మహేష్....నువ్వు రాలేదు లాస్ట్ అవర్ లో ఇచ్చారు ...
నేను : లేదు నాన్నగారు ఇవ్వలేదు....ఈపిల్ల అన్ని అబద్దాలు చెప్తుంది...
సీత : నిజం అంకుల్...ఇచ్చారు....మహేష్ ప్రోగ్రెస్ కార్డ్ కూడా నేనే తెచ్చాను....ఇప్పుడే తెస్తాను అని పరిగెట్టుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళింది సీత...

ఛా...దొంగ పోలీస్ ఆటలో కూడా ఇంత తొందరగా నేను ఎప్పుడు దొరకలేదు.ఈలోపు ముందుగానే అనుకున్న ప్లాన్ ప్రకారం ప్రనిల్ గాడు వచ్చాడు సీన్ లోకి..మా నాన్న కి వినబడేలా

ప్రనిల్ :ఏంటి రా మహేష్...మనకి ఇవ్వాళ ప్రోగ్రెస్ కార్డు ఎందుకు ఇవ్వలేదు రా....అసలే ఈసారి చాలా బాగా రాశాము మనం పరీక్షలు....

వాడి నటన చూస్తుంటే అసలు నిజం గానే ప్రోగ్రెస్ కార్డ్లు ఇవ్వలేదు ఏమొ అనిపించెలా ఉంది...నటిస్తూ మధ్య మధ్య లో నన్ను చుస్తు కళ్ళు ఎగరేసి అ అమాయకపు మొఖాని చుస్తుంటే..చంటి సినిమా లొ వెంకటేష్ ని చుస్తున్నట్లే ఉంది.ఆ లోపే సీత వచ్చి మా నాన్న చేతిలో నా ప్రోగ్రెస్ కార్డ్ పెట్టింది .ఆ దృశ్యాన్నిచూశాక.ప్రనిల్ గాడు నా వైపు జాలిగా చూస్తూ..."ఆ అమ్మ వస్తున్నా....ఇక్కడే ఉన్నా.... మహేష్ వాళ్ళ ఇంట్లో...వస్తున్నా" అంటూ మళ్లీ నటిస్తూ వెళ్ళిపోయాడు.ఇక్కడ జరుగుతున్న అన్నిట్లో ఒక మంచి విషయం ఏమిటి అంటే ఈ సారి సీత మైసుర్ పాక్ కాకుండా జాంగిరి తీసుకొచ్చింది.

ఇంకేముంది.టేపురికార్డరు ఆన్ చేసే సమయం వచ్చింది.ఘరానా మొగుడు పాటలు రీవైండ్ అవుతున్నాయి.చాలెంజి ఏమైంది అనే కదా...అసలు మీకు మనసు లేదా...ఎప్పుడు ఏమి అడగాలో తెలియదు.వెళ్లండి మళ్లీ కలుద్దాం....
                                                                                                                                        సమాప్తం

Thursday, March 4, 2010

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 3




రేపటి నుండే పరీక్షలు .... కనీసం ఈ ఒక్క సాయంత్రం అయినా చదవాలి అనే ధృడ సంకల్పం తో.... టీవీ ఆన్ చేశాను."దూరదర్శన్ కేంద్రం, హైదరాబాద్. వార్తలు చదువుతుంది శాంతిస్వరూప్, ఈనాటి ముఖ్యాంశాలు" అని శాంతిస్వరూప్ వార్తలు నిదానంగా చదవటం మొదలుపెట్టాడు. ఈ వార్తలు వింటుంటే నాకు నిద్ర వస్తుంది. టీవీ ఆఫ్ చేశాను.

చదవటం అంటూ మొదలు పెడితే అదే అలవాటు అవుతుంది అని సైన్సు టెక్స్ట్ బుక్ తీశాను. "పరిసరాలు పరిశుభ్రత " పాఠం చదువుదామని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఆ పాఠం లో బొమ్మలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.

చిలకమ్మ కొట్టు నుండి కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చిన మా అమ్మ, నన్ను చూసి అశ్చర్య, భయ, సంతోషాలకి లోనయింది .

మా అమ్మ : ఏరా చిన్నా, పుస్తకాలతో నీకు ఏం పని రా...

నేను : చదువుకుంటున్నాను అమ్మా ..

మా అమ్మ : అవునా ...ఎప్పుడో చిన్నపుడు నీ విద్యాభ్యాసం అప్పుడు చూశాను పుస్తకం పట్టడం...మళ్ళీ ఇప్పుడే చూడటం కదా .... అందుకే కళ్ళలో నిరు నిండాయి... సరిగ్గా కనిపించలేదు

నేను : సర్లే కానీ, ఉరికే ఇలా నన్ను మాట్లాడించకమ్మా, చదువుకుంటున్నాను ...నా కోసం ఏ వెధవ వచ్చినా నేను లేను అని చెప్పు .... వెళ్ళి హార్లిక్స్ బాటిల్ తీసుకోని రా ....తింటూ చదువు కుంటా ....

ఇంతలో ప్రనిల్ గాడు మహేష్ మహేష్ అంటూ వచ్చాడు ....

మా అమ్మ : నీకు వంద ఏళ్ళు ప్రనిల్, ఇప్పుడే మా వాడు నీ గురించి ఇలా చెప్తున్నాడు, నువ్వు అలా వచ్చావు. మా అమ్మ అలా హార్లిక్స్ బాటిల్ కోసం లోపలి వెళ్ళింది ...

ప్రనిల్ : ఎమైంది రా ...ఎవరు ఏమన్నారు నిన్ను, ఏదయినా ఉంటే మాట్లాడుకుంటే సరిపోతుంది కదా ... ఇలా పుస్తకం పడితే సమస్యలు పరిష్కారం కావురా ... అయినా ఇప్పుడు ఇలా చదివి ఏం చేస్తావ్ రా ..

నేను : బాగా కష్టపడి చదివి కలెక్టర్ అవుతాను ...

ప్రనిల్ : కష్టపడి చదవటం అంటే, ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని చదవటం కాదు రా ... వీధిదీపాల కింద కూర్చొని చదవాలి.. అప్పుడే కలెక్టర్ అవుతావు ..... సినిమాల్లో చూపిస్తారు కదరా ....

నేను : అవును రా ... అయినా నాకు కలెక్టర్ కంటే ఫ్యాన్ అంటేనే ఇష్టం లే ..... నువ్వు కూడా చదువుకోరా .. రేపు మళ్ళీ ఫణి గాడు చూపించలేదు అని ఏడుస్తావు.
ప్రనిల్ గాడు అలా వెళ్ళిన పది నిమిషాలకి ... సీత ఈసారి చేతిలో గిన్నె తో ... ఆంటీ ఆంటీ అంటూ వచ్చింది .....
నేను : ఏం కావాలి సీతా ...

సీత : ఏం లేదు ... ఒక గుప్పెడు కంది పప్పు కావాలి అని అమ్మ పంపింది ....

నేను : గుప్పెడు అని చెప్పి గిన్నెడు పట్టుకు పోతావు ..... అయినా మేము ఎందుకు ఇవ్వాలి మీకు ....మొన్న లడ్డూలు చేసుకొని కనీసం ఒక రెండు రూచి చూడమని కూడ ఇవ్వలేదు కదా మీరు ....

సీత : మరిచిపోయాను మహేష్ .... పోనీ ఇప్పుడు తీసుకుని రానా ....

నేను : మాకు వద్దు లే .....అడిగి తీసుకుంటే అడుక్కున్నారు అంటారు అంతా ..... రేపు స్కూల్ కి వచ్చేటప్పుడు లంచ్ బాక్స్ లో తీసుకుని రా ....

సీత : సరే అలాగే తీసుకొస్తాలే ... ఆంటీ ఉన్నారా.....?

నేను : మా తాత్తయ్య పుట్టినరోజుకి, వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది ....

సీత : లేదే .... ఇందాకనే చూశాను నేను ఆంటీ నీ ...

నేను : ఇప్పుడే telegram వచ్చింది...ఇందాకే వెళ్ళింది ....

సీత : అయ్యో మరి నీకు భోజనం ఎలా ....పద మా ఇంట్లో తిందాం గాని...

నేను : ఏంటి ఇది అంతా నా మీద అభిమానమే!!!...తట్టుకోలేకపోతున్నా సీతా ...

అమ్మా, సీత కి గిన్నెడు కంది పప్పు కావాలి అంట ...ఇచ్చి పంపు....అలాగే కరివేపాకు కూడా ఇచ్చి పంపు....లేకుంటే మళ్ళీ వస్తుంది...ఆంటీ ఆంటీ అంటూ ......
సీత కంది పప్పు, కరివేపాకు తో విజయవంతంగా వాళ్ళ ఇంటికి వెళ్ళింది.

అందరినీ అలా పంపించి ఇలా టెక్స్ట్ బుక్ లో మొద్దటి లైన్ చదవగానే , నా వీపు నేల వైపు ఒరగటం మొదలుపెట్టింది. టెక్స్ట్ బుక్ లో అక్షరాలు మసక మసక గా కనబడుతున్నాయి.ఈ లక్షణాలు అన్నీ నిద్రవే అని కనిపెట్టిన నేను లేచి, అటు ఇటు తిరుగుతూ చదివాను. అర్ధగంట లో ఆరు పేజీలు చదివాను. మనిషి అనేవాడు ఎవ్వడూ అరగంటకి మించి చదవలేడు. నాకు ఇప్పుడు విరామం కావాలి ... టీవీ ఆన్ చేశాను. శాంతిస్వరూప్ వెళ్ళిపోయాడు .... చిత్రలహరి మొదలయ్యింది. టీవీ సౌండ్ పెంచాను. ఎప్పుడూ చిరంజీవి సినిమా పాటతో మొదలయ్యే చిత్రలహరి ఈసారి శోభన్ బాబు పాటతో మొదలయ్యింది. "గాలి వాన లో, వాన నీటిలో ...." . ఈ పాట వినలేక టీవీ ఆఫ్ చేయబోతే

"టీవీ మీద చేయి పెడితే, చేతికి వాత పెడతా.." అన్నారు శోభన్ బాబు ఫాన్స్ ...అదే, మా అమ్మ... వంట గది నుండి

నేను : "శోభన్ బాబు కోసం ఈ మహేష్ బాబు కి వాత పెడతావా ...." ఈ చేదు నిజాన్ని అబద్ధం అని చెప్పమ్మా ... చెప్పు.

"నేను ఏదైనా ఒక సారే చెప్తాను చిన్నా, రెండో సారి చేసి చూపిస్తాను. చూపించమంటావా .....?" అని చాలా నెమ్మదిగా చెప్పింది మా అమ్మ .

టీవీ ని కొద్ది సేపు మా అమ్మ కి అప్పగించి, తెలుగు టెక్స్ట్ బుక్ తీసుకుని అలా నా పడక గది లోకి వెళ్లి మంచం ఎక్కాను ... పది నిముషాలు అలా తీక్షణంగా పుస్తకం లోకి చూశాను ...ఒక దోమ నన్ను కుడదామని నా చేతి మీద వాలింది ...పాపం దానికి ఏమి తెలుసు ...అది వాలింది పులి మీద అని .... దానిని ప్రాణాలతో పట్టుకొని, దాని రెక్కలనుండి విరిచేసి వేరుగావించి నా టెక్స్ట్ బుక్ మీద వదిలేసి దానితో ఆడుకుంటున్నాను. దానికి అర్ధమైనట్లు ఉంది ..."దోమ గా పుట్టడం ఎంత దురదృష్టమో". క్షమాభిక్ష కోసం ధీనంగా చూసింది. అ చూపు నేను మా నాన్న వైపు, నన్ను కొడుతున్నపుడు చూసే చూపు లాగా ఉంది. అ చూపు మా నాన్నకి అర్ధం కాకున్నా, నాకు అర్ధమైంది. దానికి రెక్కలు మాత్రం తిరిగి ఇవ్వలేదు గాని స్వేఛ్చ మాత్రం ఇచ్చాను. ఆ దోమకి మా వీధి గుమ్మం చూపించాను. రెక్కలు లేని స్వేఛ్చ వద్దు అనుకున్నదేమో అది వెళ్ళలేదు. పెన్సిల్ తో తోశాను, అయినా వెళ్ళలేదు. ఈసారి ఊదేశాను. వెళ్ళిపోయింది.

గోడకి ఉన్న గడియారం గంట కొట్టింది. టైం తొమ్మిది గంటలు అయింది. తెలుగు టెక్స్ట్ బుక్ మళ్ళీ తీసుకొని చదవటం మొదలుపెట్టాను ...................................................................

"ఏరా చిన్నా .... లే ఇంక ... స్కూల్ కి టైం అవుతుంది .. పొద్దున్నే లేచి చదువుకోవచ్చు కదరా... ఈరోజు పరీక్ష ఉంది కదా" --పోలీసు గొంతు తో మా నాన్న

ఉలిక్కిపడి లేచాను!.

ఒక్క నిమిషం లో మొహం కడిగేసి, రెండు నిమిషాల్లో స్నానం చేసేసి, మరు నిమిషం లో దేవుడి పటం ముందు నిల్చున్నాను.

"దేవుడా ....ఏ రోజుకి ఆ రోజు నిన్ను కలుద్దాం అనుకుంటూనే ఉన్నాను
కాని రోజుకి ఇరవై నాలుగు గంటలే కావటం వల్ల అది కుదరటం లేదు
ఈ రోజు మాత్రం ఎన్ని పనులు ఉన్నా, చివరికి పరీక్షలు ఉన్నా, ఆ పరీక్షలకి
సమయం మించిపోతున్నా, నిన్ను కలవాలి అని వచ్చాను...దేవుడు లేడు
అనుకునే మనుషులకి నువ్వు ఉన్నావు అని చూపించాలి ...అలా చూపించాలి
అంటే నాకు నువ్వు ఫస్ట్ రాంక్ తెప్పించాలి ... పరీక్షకు టైం అయింది .. మళ్ళీ కలుద్దాం ...
ఇట్లు అప్పుడప్పుడు ఎల్లపుడు పూజించే మీ చిన్ని భక్తుడు.."

ఇస్త్రీ చేసి ఉన్న నా నీలం కలర్ లాగు , వైట్ కలర్ చొక్కా (మా స్కూల్ డ్రెస్) వేసుకొని, విబూది పెట్టుకొని, పక్క పాపిడి దువ్వుకొని అమ్మ తినిపిస్తున్న ఇడ్లీ తింటూ మా టేప్ రికార్డర్ లో పాటలు వింటున్నాను ...ఇది చూసి మా నాన్న కి కుళ్ళు పుట్టింది ... "ఏరా .... పరీక్ష కదా ... పుస్తకం తీసి చదువుకోవచ్చు కదా" అన్నారు మా నాన్న .

నేను : లేదు నాన్న గారూ... పరీక్షకి ముందు చదివితే చదివింది మరిచిపోతాం అంట ... అందుకే నేను ఎప్పుడూ అలాంటి తప్పు చేయను.
నాన్న గారూ నాకు ఈ లిస్టు లో ఉన్నవి కావాలి

నట్రాజ్ పెన్సిల్స్ -2
క్యామల్ ఎరేసర్ -1
షార్ప్‌నర్ -1
30 cms నట్రాజ్ స్కేల్ -1
ఫైవ్ స్టార్ చాక్లెట్స్ - 2

మా నాన్న : చాక్లెట్స్ ఎందుకు రా .....

నేను : రాస్తూ రాస్తూ అలిసిపోతే తినటానికి నాన్న గారూ ....

మా నాన్న : నువ్వు ఎంత సేపు రాస్తావు రా ....పది నిమిషలు అంతే కదా ....

ఏదైనా చేసి చూపించడం నాకు అలవాటు కాబట్టి మా నాన్న తో వాదించకుండా ఇడ్లీ తింటూ ఉన్నాను.
మా నాన్న అలా బయటకి వెళ్ళి నా లిస్టు లోవి అన్నీ తీసుకొచ్చారు.
పరీక్ష ప్యాడ్, ఈ లిస్టు లోవి అన్నీ బాగ్ లో వేసుకొని స్కూల్ కి వెళ్దాం అని బస్సు స్టాప్ కి బయలుదేరాను ....

Friday, February 5, 2010

ఛాలెంజి..ఛాలెంజి..ఛాలెంజి..2


                                                                            రచన : మహేష్  
                                                                           కూర్పు : శ్రీరామ్ 
       
క్లాసు లో అంతా నిశబ్దం...పరీక్షల ఫలితాలు తెలిపే రోజు....ఈసారి కూడా ఎప్పటి లాగే సీతకి , ఫణి కి గట్టి పోటి ..సీతకి తన మీద తనకి ఎంత నమ్మకం ఎక్కువ అంటే ....ఫస్ట్ రాంక్ వస్తుంది అన్న నమ్మకం తో స్వీట్ బాక్స్ కూడా తీసుకొచ్చింది పంచటానికి ....ఫణి గాడు నా పక్కన కూర్చొని maths exam లో తప్పు పెట్టిన ఒక bit question గురించే ఆలోచిస్తున్నాడు.

నేను : ఏరా,ఇప్పుడు ఆలోచిస్తే ఆ 1/2 (హాఫ్) మార్క్ వస్తుందా చెప్పు....కనీసం నీకు ఏ question తప్పు పెట్టావో తెలుసు,నాకు అయితే అసలు ఏ  question రైట్ పెట్టానో కూడా గుర్తులేదు..
ఫణి :నీకు ఏం తెలుసు రా...1/2(హాఫ్)మార్క్ విలువ...1/2(హాఫ్)మార్క్ తో ఫస్ట్ రాంక్ పోతుంది .
నేను : నాకు కూడా తెలుసు లేరా ...1/2(హాఫ్)మార్క్ తో ఫెయిల్ కూడా అవుతాము.ఆ 1/2(హాఫ్) మార్క్ వచ్చి ఉంటే కనీసం మాథ్స్ లో అన్నా పాస్ అయ్యేవాడిని .
క్లాసు లో ప్రొగ్రెస్ కార్డు ఇవ్వడానికి మా హెడ్ మాస్టర్(HM) వచ్చారు....
HM :డియర్ స్టూడెంట్స్ ,ఈసారికూడా ఎప్పటి లాగే ఫణి కి,సీత కి చాలా పోటి ఉన్నది...వాళ్ళ మార్కులు
తెలుగు లో ఫణికి 92,సీతకి 92
ఇంగ్లీష్ లో ఫణి కి 94,సీతకి 94
హిందీ లో ఫణి కి 91,సీత కి 91
నేను ఫణిగాడి తో మెల్లగా : ఏంటి రా ...ఇద్దరికీ ఒకటె మార్కులు వస్తున్నాయి....ఎవరి దాంట్లో ఎవరు చూసి కాపీ కొట్టారు రా....ఇలా కాపీ కొడితే దొరికిపోతారు రా ఎప్పుడో ....
మాథ్స్ లో ఫణి కి 90 సీత కి 92
ఫణి నాతో మెల్లగా : మాథ్స్ టీచర్ వల్ల బాబాయ్ రా ...అందుకే దానికి రెండు మార్కులు ఎక్కువ వేసారు ...
సైన్సు లో ఫణి కి 92 సీతా కి 90
నేను ఫణి గాడి తొ మెల్లగా : ఏరా, సైన్సు టీచర్ మీ బాబాయ్ ఆరా ...?
ఫణి : లేదు రా ...మనకి ఎక్కువ మార్కులు వస్తే ,కష్టబడి వచ్చాయి అనుకోవాలి , పక్కన వాళ్ళకి వస్తే కాపీ కొట్టారు అనో లేక టీచర్ వాళ్ళ బాబాయ్ అనో అనుకోవాలి రా ....
ఫణి గాడి reasoning చూసి నా కళ్ళు చెమ్మ గిలాయి...
నేను : అలా అయితే , నా దృష్టిలో నేను తప్ప ,ఈ క్లాసు లో వాళ్ళు అంతా కాపీ కొట్టారు అన్నమాట...
ఫణి : నేను చెప్పింది నువ్వు కొంచెం సీరియస్ గా తీసుకున్నావు రా .....
సోషల్ లో ఫణి కి 96 సీతకి 95 1/2
నేను : ఒరేయ్ నువ్వు చెప్పిన 1/2 మార్క్ theory ఇప్పుడు practical గా చూస్తున్నాను రా ...1/2 మార్క్ తో ఫస్ట్ రాంక్ పోయేది రా ....భలె గా చెప్పావు రా ...
HM : సో డియర్ స్టూడెంట్స్ , ఈ సారి సీత కంటే ఫణి కి 1/2 ఎక్కువ వచ్చింది...ఫణి టోటల్ 555 ,సీతా టోటల్ 554 1/2 .
సీత కి కోపం వచ్చింది ,బాధ వచ్చింది , ఏడుపు కూడా వచ్చింది ....సోషల్ టీచర్ తో గొడవకి బయలుదేరింది.
మా సోషల్ టీచర్ కి చరిత్ర తో పాటు భవిష్యత్తు కూడా బాగా తెలుసునట్లు ఉంది . ముందుగానే స్టాఫ్ రూం లోపల గొళ్ళెం పెట్టుకొని , బయట  "లోపల ఎవరు లేరు" అన్నే బోర్డు కూడా పెట్టాడు
నేను : ఏం సీతా , ఎక్కడికి వెళ్తున్నావ్ ...సోషల్ టీచర్ దేగ్గరికా ...నీ answer షీట్ మళ్లీ check చేపించుకుని ఒక మార్క్ వేయించుకుంటావా ఏంటి ....
ఫణి : ఒరేయ్ దానికి లేని పోనీ ప్లాన్స్ చెప్పకు రా..ప్లీజ్
సీతా : లేదు , ఫణి answer షీట్ తీసి , తప్పులు చూపించి 1 /2 మార్క్ కట్ చేపిస్తా ......
నేను : పాజిటివ్ attitude అంటే ఇదేనేమో ....
HM : సీత , కూర్చో ...ప్రొగ్రెస్ కార్డు ఇచ్చే టైం అయింది ...
నేను : ఏరా ఫణి , ఎలాగో ప్రొగ్రెస్ కార్డ్స్ రాంక్ ప్రకారం ఇస్తారు కాబట్టి, నా కార్డు రాటానికి ఇంక చాలా టైం ఉంది కాబట్టి , నేను అలా కళ్ళు మూసుకొని , మా నాన్న సంతకం ప్రాక్టీసు చేస్తూ , మధ్య మధ్య లో నిద్ర పోతు ఉంటా ...నా కార్డు వచిన్నపుడు లేపు ...సరేనా
ఫణి : సరే రా ....ఈ సరైన నోరు మూసుకుని నిద్ర పోరా ...లేకపోతే దొరికిపోతావ్ ...
నేను: నోరు ముస్తే చాలా ..లేక కళ్ళు కూడ తెరిచి నిద్ర పోవాలా ....
HM : స్టూడెంట్స్ , ఈసారి నేరాలు ఏమో గాని ఘొరాలు మాత్రం జరిగాయి....మహేష్ స్టాండ్ అప్...
నేను : సర్ , నేను ఇంక నిద్ర కూడ పోలేదు సర్ అప్పుడే స్టాండ్ అప్ ఏంటి , మా నాన్ననే  నయం ..కనీసం తన జేబు లో  కొట్టేసిన తీసుకున్న 10 రూపాయలు గురించి 6 నెలలల తర్వాత అడుగుతాడు ..ఎంతైనా పోలీసు కదా
HM : ఆది కాదు లే కాని ...ఇదిగో నీ ప్రొగ్రెస్స్ కార్డు తీసుకో ....
నేను : అదేంటి సర్ , ఇ  సారి కొత్తగా లాస్ట్ రంక్ నుండి ఇస్తున్నారా....ఇలా అయితే ఎలా...మా ప్లాన్స్ మాకు ఉంటాయి కదా ...
HM : ఈ సారి పరిక్షలు ఎలా రాసావు రా ...
నేను : ఈ సారి కష్టబడకుండా ఇష్టబడి రాసాను సర్ ...
HM : ఈ సారి ఫస్ట్ రాంక్ నువ్వే రా .....మహేష్ ..ప్రొగ్రెస్స్ కార్డు తీసుకో ....నీ total 565 ..ఫణి గాడి కంటే 10 మార్కులు ఎక్కువ ....ఇదే ఈసారి జరిగిన ఘొరం ...
నేను : సరిగా చుడండి సర్ ....మహేష్ ఆ లేక సురేష్ ఆ ...
HM : నాకు ముందే అ  డౌట్ వచ్చి చూసాను రా ....ఏంటో నీ పేరే ఉంది రా ఇక్కడ....
నేను : ఇంక చాలు సర్ ,అయినా నాకు తెలుసు సర్ , నేను చాలా బాగా రాసాను ఈసారి పరిక్షలు ...తెలుగు పరిక్ష లో అయితే .."ఈ కింద ఇచ్చిన 5 ప్రశ్నలు లో ఏవైనా 3 ప్రశ్న సమాధానం ఇవ్వండి " అంటే నేను 5 ప్రశ్నలుకి సమాధానం ఇచ్చాను...అంతే కాదు ఇంకో ప్రశ్న కూడ నా సొంతం గా కలిపి దానికి కూడ సమాధానం ఇచ్చాను....
HM : సర్లే కాని ..ఈ సారినా సరైన ప్రొగ్రెస్ కార్డు మీద మీ నాన్న తో సంతకం పెట్టించు ...నువ్వు పెట్టకు ...
నేను : సర్ , ఎలా కనిపెట్టారు ...నేను మా నాన్న సంతకం కరెక్ట్ గానే పెట్టాను కదా ...
HM : సంతకం కరెక్ట్ గా నే పెట్టావు కాని ...అ బ్రాకెట్ లో "ఈ సంతకం పెట్టింది నేనే , మా అబ్బాయి కాదు " అన్ని రాస్తే దొరకవా మరి...
నేను : ఏంటి , అంత క్లియర్ గా ఈ సంతకం నేనే పెట్టాను , మా అబ్బాయి కాదు అని రాసిన మీకు నా మీద అనుమానం వచ్చింది అంటే , మీకు తెలుగు చదవటం రాదు అనుకుంటా....
HM : ఈ తెలివితేటలకి తక్కువ ఏం లేదు లే ....
ఈ దారుణాలు చూడలేక మా హెడ్ మాస్టర్ ,మా క్లాసు టీచర్ నీ ప్రోగేస్స్ కార్డు ఇవ్వమని వెళ్ళిపోయారు ...
నేను : ఏరా ఫణి ...మనిషికి సంకల్పం ఉండాలి గాని ,సన్ మీదకి కూడా వెల్లొచ్చు రా ....
ఫణి : theory లో కొటేషన్ కరెక్ట్ ,కాని practical లో కుదరదు అనుకుంటా రా..
నేను : నేను ఇప్పుడు theory చెప్పానా ..లేక practical గా చెప్పానా ..?
ఫణి : theory లో నే చెప్పావ్ ....
నేను : అయితే కరెక్ట్ ఎ కదా ....
ఫణి : కరెక్ట్ ఎ కాని ఇవి అన్ని నాకు ఎందుకు చెప్తునావ్ , నేను ఎందుకు వింటున్నా రా ..
నేను : ఎందుకు అంటే నేను ఇప్పుడు ఫస్ట్ రాంక్ కాబట్టి, నువ్వు సెకండ్ రాంక్ కాబట్టి ....
సీతా ,నువ్వు ఏంటి మరి స్వీట్స్ బాక్స్ కూడా తీసుకొని వచ్చావు ....నువ్వు ఫస్ట్ రాంక్ వస్తావు అనుకోవడం నీ మీద నీకు ఉన్న నమ్మకం ..వేరేవాళ్ళు కి కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని తెలుసుకో లేకపోవడం పిచ్చి అంటారు దాన్ని .....ఏం పర్లేదు లే ....ఈ నెల మీ నాన్నకి స్వీట్లు ఖర్చు, పెట్రోల్ ఖర్చు,సర్కుస్ ఖర్చు ఉండదు లే ...అ స్వీట్స్ లో ,నాకు రెండు ఇచ్చి , నా పేరు చెప్పి మిగిలిన వాళ్ళు అందరికి ఒక్కొక్కటి ఇవ్వు ....
అయినా ఫస్ట్ రాంక్ వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయటం , సెకండ్ రాంక్ వచ్చిన వాళ్ళు బాధపడటం ,లాస్ట్ రాంక్ వచ్చిన వాళ్ళు ,వాళ్ళ ప్రొగ్రెస్స్ కార్డు లో వడే సంతకం పెట్టడం మాములే ...
మధ్య లో ఎక్కడ నుంచో మా అమ్మ "ఏరా, స్కూల్ కి టైం అయింది లేరా . ఎంత సేపు నిద్రపోతావు రా !...నీకు ఇష్టం అని ఇడ్లి లోకి కారం పొడి కూడా చేశాను ...లే ..తొందరగా లేచి మొహం కడుకో ..."
అమ్మ ,ఇంకొద్ది సేపు నిద్ర పొతాను..ఇప్పుడే సీత ఏడుస్తుంది , నేను నవ్వుతున్నాను ,ఇలాంటి కలలు రోజు రావు, వచ్చినా మళ్లీ ఫస్ట్ రాంక్ రావటం అంటే కష్టం అమ్మ ....
మా నాన్న టేప్ రికార్డర్ ఆన్ చేసాడు .ఈ సరి పాటలు వినటానికే."నిన్నటిదాకా శిలనైనా,నీ పాదము సోకినే గౌతమినైనా" పాట పెట్టాడు ....దెబ్బకి లేచి కూర్చున్నాను. టేప్ రికార్డర్ నుండి వస్తున్న పాట విని కాదు ....మా నాన్న గొంతు లో నుండి వస్తున్న పాట విని...లేచి అలా నోట్లో బ్రష్ వేసి , వీధి లో కి వెళ్ళాను ..
నీళ్ళ కుళాయి దగ్గర సీత వాళ్ళ నాన్న , ఎదురింటి లక్ష్మి ఆంటీ వంతుల కోసం కొట్టుకుంటున్నారు.సీతా వల్ల నాన్న కి నోరు ఎక్కువ , లక్ష్మి ఆంటీ కి బలం ఎక్కువ .ఎవరు గెలుస్తారు అన్ని ఆసక్తి గా చూస్తున్న నాతో ఇద్దరు కలిసారు ...
ప్రనిల్ : ఏరా ..ఎవరు గెలుస్తారు అంటావ్...
పరమేష్: సీతా వల్ల నాన్న గెలవాలి అంటే ,ఇంకో ఇద్దరు మనుషులు కావాలి రా ....
నేను : ఆది సరే కాని .....మీకు ఒక విషయం చెపాలి రా ....
ప్రనిల్ : ఏంటి రా ...ఇవ్వాళ స్కూల్ లేదా .....
నేను : అది కాదు రా ....నాకు కల వచ్చింది రా ఇందాక..ఫస్ట్ రాంక్ వచ్చాను .సీత ఒకటే ఏడుస్తుంది థర్డ్ రాంక్ వచ్చింది అని.మన హం అయితే పొగుడెస్తున్నడు రా నన్ను ...
ప్రనిల్ : అయితే 600/600 తెచ్చుకొవలసింది రా ...ఎలాగో కల నే కదా
నేను : లేదు రా ...కల కూడా సహజత్వం కి దగ్గర గా ఉండాలి రా ....
పరమేష్ : అంటే , ఇప్పుడు నీకు 560/600 అంటే సహజత్వం కి దగ్గర గా ఉనట్లా ?
నేను : ఒరేయ్ పరమేష్ , తప్పు చెప్పవు రా ...560 కాదు రా ..565 మార్కులు రా ....
పరమేష్ : సహజత్వం అంటే ...నీకు 280 /600 రావాలి ..ఇది సహజత్వం అంటే ...కాని 560 అంటే !!
నేను : నీకు కుళ్ళు రా ...
ప్రనిల్ : నేను ఎన్నో రాంక్ వచ్చాను రా ....
నేను : నేను ఫస్ట్ రాంక్ వచ్చాను అంటే , నువ్వేకదా లాస్ట్ రాంక్ రా ....అన్ని subjects లో ఫెయిల్...కొంచెం చదవొచ్చు కదరా ...నా పరువు అంతా పోయింది తెలుసా....
నాకు కల్లో ఎప్పుడు రౌడిలతో చిరంజీవి లాగా fighting చేయటం,డాన్స్ వేయడం లాంటి చిన్న చిన్న కలలు తప్ప , ఇలాంటి ఫస్ట్ రంక్ రావటం లాంటి పెద్ద కల రాలేదు రా ...ఇవ్వాళ కలోకి వచ్చింది అంటే , అది నిజం గా జరగటానికి ఎంతో దూరం లేదు ...అందులోను పొద్దు పొద్దునే వచ్చే కలలు నిజం అవుతాయి అంట కదరా ...
ప్రనిల్ : అంతా అబద్దం రా ...నాకు రోజు ..ఈ రోజు సండే అన్నే కల వస్తుంది ...కాని ఏ రోజు సండే అవటం లేదు కదా ....ఒక సండే రోజు తప్ప ....
పరమేష్ : అయినా పొద్దున ఎనిమిది గంటలకి వచ్చే కలలని ,కలలు అనరు రా ..పగటి కలలు అంటారు ...
నేను : ఒరేయ్ పరమేష్ , నీకు రెండు rambo notebook stickers ఇద్దాం అనుకున్నా రా ...ఇప్పుడు ఇవ్వను ఇంక ...
మా ఇంట్లో నుండి మా అమ్మ , ఏరా ఇవ్వాళ మళ్లీ పక్క తడిపావా...లాభం లేదు నీ కోసం ప్లాస్టిక్ పట్టా కొనాలి అని వీధి లో ఉన్న అందరికి వినబడే లాగా చిన్నగా చెప్పింది...
నీళ్ళ కుళాయి దగ్గర గొడవ ఆపిమరీ జనాలు నావైపు చూస్తున్నారు,ఇంక సీత గురించి చెప్పనక్కర్లెదు ...నా ఎదురుగా వచ్చేసింది ..చేతిలో మళ్లీ స్వీట్ బాక్స్ తో ...
నేను : మా అమ్మ ఇంకా నన్ను తిట్టలేదు సీతా ...తిట్టి నప్పుడు పిలుస్తా అప్పుడు ఇద్దువు లే స్వీట్స్
        ఏంటి సీతా ఇది , ఇలాంటి నీళ్ళ కుళాయి పోటి లోకి మీ అమ్మ రావాలి గని , మీ నాన్న నీ పంపారు ఏంటి ...ఆట లో మాజా లేదు ....ఇలాంటి ఆటలో ఆడేవారు కంటే చూసే వారికే  మాజా రావాలి..మాజా రావాలి  అంటే మీ అమ్మ రావాలి ...అప్పుడు గట్టి పోటి ఉండేది ....   
సీతా : ఇవ్వాళ నా పుట్టిన రోజు మహేష్...
నేను : అవునా , ఏంటో సీతా నాకు నువ్వు ఎప్పుడు స్వీట్ బాక్స్ తో నే కనబడుతావు...చివరికి ఇవ్వాళ కల లో కుడా అలాగే కనిపించావు . ఇవ్వాళ ఎవరి ఇంటికి వెళ్ళినా , ఒక స్వీట్ తీసుకోని 10 రూపాయలు ఇస్తారు లే...పుట్టిన రోజు కదా ...సర్లే లే ..ఇంట్లోకి వెళ్లి మా అమ్మ తో నేను చెప్పాను అన్ని చేపి 15 రూపాయలు తీసుకొని , 5 రూపాయలు నువ్వు తీసుకొని , 10 రూపాయలు నాకు ఇచ్చి వెళ్ళు ...సరేనా           
ప్రనిల్ : అవును రా ...పుట్టిన రోజులు నెలకి ఒక సారైన రావాలి .
పరమేష్ : ఒరేయ్ ...పుట్టిన రోజు అంటే ఇయర్ కి ఒకసారే వస్తుంది రా ...
ప్రనిల్ : అలా అయితే , జీవితం లో నే ఒక సారి వస్తుంది రా ...ఆది మనం పుట్టిన రోజు... అ రోజు మన పుట్టిన రోజు అన్ని మనకే తెలియదు ...ఇప్పుడు మనం చేసుకునేవి అన్ని growingdays రా ...
నేను : growingdays అంటే ..?
ప్రనిల్ : మనం పెరుగుతున్న రోజులు రా ...అందుకే birth బదులు growing అని పెట్టాలి రా....
పరమేష్ , వీడిని జాగ్రతగా వాడి ఇంటి దగ్గర వదిలేసి ,నువ్వు మీ ఇంటికి వెళ్ళ రా ...ప్రనిల్, ఇంటికి వెళ్లి పాలు తాగుతూ ,horlicks తినురా ...సెట్ అవుతుంది మైండ్ ...
               నా బ్రాషింగ్ చేసి ఇంట్లో కి వెళ్ళే సరికి మా నాన్న నా కోసమే, తన "పాడుతా ఘాటుగా" ప్రోగ్రాం కి విరామం ఇచ్చరు .
మా నాన్న : ఏరా stupid ,  ఇవ్వాళ మళ్లీ పక్క తాడిపావు అంటా...ఇంకా అ అలవాటు మానవ ..
నేను : నా చేతిలో లేని వాటికీ  నేను ఏమి చేపగాలను . ఏంటో! తెలియకుండానే అల కొన్ని జరిగిపోతాయి.అయిన అమ్మ ప్లాస్టిక్ పట్టా కొంటాను అన్నది కదా ...
మా నాన్న : అలా అంటే అన్నా సిగ్గు తెచ్చుకొని  తడపకుండా ఉంటావు అని అలా చెప్పింది మీ అమ్మ 
నేను : ఇలాంటి చిన్న చిన్న సరదాలు చిన్నపుడే కదా చేయాలి ...
మా నాన్న : ఈ తెలివితేటలు చదువు లో చూపిస్తే ఎప్పుడో ఫస్ట్ రంక్ వచ్చే వాడివి .
నేను : ఫస్ట్ రాంక్ రావాలి అంటే తెలివితేటలు సరిపోవు నాన్న గారు , సీత లాగా కంటస్థం పట్టాలి.
        "నేనేమి కంటస్థం పట్టాను " అని వెనుక నుండి సీత వాయిస్ 
నేను : ఏం సీతా , నువ్వు ఇంకా వెళ్ళలేదా.నువ్వు వెళ్ళిపోయావు అనుకొని నిజం చెప్పాను...
సీతా : నిజం మహేష్ , నేను ఎప్పుడూ  కంటస్థం చెయ్యను .
నేను : సరే అయితే , సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడో చెప్పు చుద్దాం .
సీతా : తూర్పు దిక్కు 
నేను : బలే ఫాస్ట్ గా చెప్పావు సీతా ...ఇప్పుడు అదే ఫాస్ట్ లో నువ్వు నిల్చున్న ప్రదేశం నుండి తూర్ఫు దిక్కు ఎటు వైపు చెప్పవా ....
సీతా : మరి ...అది ఏమో ...అది ఏమో 
నేను : చూసావా ..నువ్వు పాఠం చదువుతావు , నేర్చుకోవు ...పర్లేదు లే  ఈ లోకం కి , మా నాన్న కి ఫస్ట్ రాంక్ ఏ important లే ....నువ్వు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు ....ఇంక చాలా మందికి స్వీట్స్ ఇవ్వాలి కదా 
సీతా : ఇందాక ఆంటీ కి స్వీట్ ఇచ్చను . ఆంటీ 10 రూపాయలు ఇవ్వడం మరిచిపోయారు.
నేను : ఉహ్హ ....ఇప్పుడు 10 రూపాయలు కోసం ధర్నా చేస్తున్నావా.
సీతా : లేదు ఎదురుచూస్తున్నా
నేను : అదేదో మేము నీకు 10 రూపాయలు బాకీ ఉనట్లు అడుగుతుంటే అనుమానం వచ్చి అడిగాను అంతే ....సర్లే మా అమ్మ ఇస్తే నీకు స్కూల్ లో ఇస్తాను లే ...వెళ్ళు మళ్లీ స్కూల్ కి లేట్ అవ్వుతుంది ....వెళ్ళే ముందు ఇంకో స్వీట్ ఇచి వెళ్ళు ....              
         సీతా తన పుట్టిన రోజు collection కోసం పక్కింటి కి వెళ్ళింది ...
         మా నాన్న  , నేను సీతనీ  అడిగిన ప్రశ్న నే ఆలోచిస్తూ 
మా నాన్న : తెలిసి చెప్పావో , అనుకోకుండా చెప్పావో గాని నిజం చెప్పావు ..ఎప్పుడూ పాఠం చదవకూడదు, నేర్చుకోవాలి.
నేను : నేను తెలిసి తెలిసి ఏ పని చేయను నాన్న గారు .ఆది పక్క తడపటం అయిన ,మాట్లాడటం అయిన ...
మా నాన్న : నీ గురించి నాకు తెలుసు కదా ... ఇంతకీ తూర్పు దిక్కు ఎటో నీకు తెలుసా ...
నేను : నాన్న గారు , ప్రశ్న అడిగిన వల్లనే మళ్లీ ప్రశ్న అడగటం అన్యాయం , అందులో మళ్లీ అదే ప్రశ్న నీ అడగటం నేరం కూడ ...            
మా నాన్న : అదంతా సరే కాని ,నీకు తూర్ఫు దిక్కు ఎటో తెలుసా ... 
నేను : ఇంత చెప్పిన మళ్లీ అడుగుతున్నారు అంటే , మీకు ఏమి అర్ధం కాలేదు అని  నాకు అర్ధంయంది . నాకు  సమాదానం తెలిసిన ప్రశ్నలు నేను ఎప్పుడు ఎవరిని అడగను నాన్న గారు ..
మా నాన్న : నాకు,నువ్వు ఏమి అర్ధం కావాలి అన్ని చెప్తునవో కాని , నాకు మాత్రం వకటి అర్ధమయింది."నీకు సమాదానం తెలియదని" , తెలియక పోతే తెలియదు అన్ని ఒప్పుకోవచ్చు కదా రా. 
నేను : ఒప్పుకోవడం , తప్పుకోవడం , తెచ్చుకోవడం  ...నాకు ,చిరంజీవి కి తెలియదు 
మా నాన్న: తప్పుకోవడం , తెచ్చుకోవడం ఏంటి రా ..
నేను : ఏదో ప్రాస కోసం నాన్న గారు ...అసలు సమాధానం తెలిసి ప్రశ్నలు అడిగే వాళ్ళని టీచర్ అంటారు ...సమాధానం తెలుసుకోటానికి ప్రశ్నలు అడిగే వాళ్ళని స్టూడెంట్స్ అంటారు ....నేను స్టూడెంట్ నీ కదా .....


        మా నాన్న ఆలోచన లో పడ్డారు ....మా ఇంటి నుండి స్కూల్ కి వెళ్ళటానికి 5 నిమిషాలు పడుతుంది కాని మా నాన్న ,ఆలోచన నుండి ఆవేశం,కోపం  లోకి మారటానికి కేవలం 2 నిమిషాలే పడుతుంది.అదేంటో ఘరానా మొగుడు పాటల  casette రివైండ్ అవ్వటానికి కూడ 2 నిమిషాలే పడుతుంది ....ఇప్పుడు రివైండ్ అవుతుంది ...ఇంక నా దగ్గర 11/2 నిమిషాలే ఉన్నాయి .....మిగతా విషయలు ఈసారి కలిసినప్పుడు చెప్తాను   
                 
          

Tuesday, February 2, 2010

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 1

                                                                                        రచన : మహేష్  
                                                                                        కూర్పు : ఫణి 


నా ఛాలెంజి విషయం అ మరుసటి రోజు జరిగే మా గ్యాంగ్ మీటింగ్ లో ప్రస్తావన కి వచ్చింది
నేను,పరమేష్ ,ప్రనిల్ ఇది మా గ్యాంగ్.....ఈ గ్యాంగ్ కి లీడర్ నేనే ....ఎందుకు అంటే రోజు నా దగ్గర  2 రూపాయలు ఉంటాయి కాబట్టి!
పరమేష్ వాళ్ళ ఇంటి గోడ పైన మీటింగ్ లో నేను .......
" ఏంటిరా ప్రనిల్ గాడు  ఇంకా  రాలేదు !....కొంపదీసి చదువుకుంటున్నడా  ఏంటి...?"
"లేదు లేరా ...వాళ్ళ అమ్మ , వాడిని గుడ్ల కోసం చిలకమ్మ  కొట్టు కి పంపింది"  అన్నాడు పరమేష్ ...
"అయితే వీడికి మళ్లీ రూపాయి లాభం అన్నమాట ..!"
అంతలోనే ప్రనిల్ గాడు  పరిగెత్తుకుంటూ  వచ్చాడు......
నేను : "ఏంటి రా ...మొఖం అలా కొత్త గోలీలలాగా మెరిసిపోతోంది .....ఏంటి సంగతి  ?...
పరమేష్ : వాళ్ళ నాన్న ఊర్లో లేడేమో రా .....
ప్రనిల్ : అదేం కాదు రా .....రూపాయితో లాటరీ  తీస్తే prize వచ్చింది రా .....
నేను : అవునా ....ఏం prize రా ...చూపించు
ప్రనిల్ : ఇదిగో ...ఇదే ...గ్యాంగ్ లీడర్ సినిమా లో చిరంజీవి పెట్టుకున్న కళ్ళ జోడు ఇదే అంటరా...చిలకమ్మ  చెపింది
పరమేష్ : అవునురా ..ఈ కళ్ళజోడే రా ....తెల్లటి  ప్లాస్టిక్ frame ....నల్ల అద్దాలు ....ఇదే ...
ప్రనిల్ : ఈ కళ్ళ జోడు తో ఎలా ఉన్నాను రా నేను ...చెప్పండి ....
నేను : frame ఒకటే కనబడుతుంది రా .....అద్దాలు నీ కలర్ లో కలిసిపోయాయి రా .....నల్ల frame .తెల్ల
అద్దాలు అయితే బాగుండేదిరా ....
పరమేష్ : అప్పుడయినా  అద్దాలు ఒకటే కదా కనబడేవి ...
ప్రనిల్ : మీకు కుళ్ళు రా ....నాకు prize వచ్చింది అని  ....
నేను : అ కళ్ళ జోడు ....గ్యాంగ్ లీడర్ లో చిరంజీవికీ ....మన గ్యాంగ్ లీడర్ అయిన నాకే బాగుంటాయిరా ...
ప్రనిల్ గాడి  దగ్గర కళ్ళజోడు తీసుకొని నేను పెట్టుకున్నాను
నేను : ఇప్పుడు చెప్పండిరా ...ఎలా ఉన్నానో...నా జేబు లో ఉన్న బఠానీలు   దృష్టి లో ఉంచుకొని చెప్పండి
పరమేష్: మొదటిసారి ,  సరిగా అనిపిచలేదు కాని ...నువ్వు బఠానీలు గురించి చెప్పినతర్వాత చూస్తే ...మెషిన్ గన్ పట్టుకున్న మెగాస్టార్ లా ఉన్నావ్ రా....
ప్రనిల్ : నాకైతే  మాటలు రావటం లేదు రా ...
నేను : నువ్వు కొంచెం ఎక్కువ చేస్తున్నావ్ రా ప్రనిల్ ...సరే కాని ...నాకు , మా బాప్స్ కి నిన్న పెద్ద
గొడవ జరిగి...చిన్న ఛాలెంజి చేశాను రా ...నేను ఎలాగైన ఈసారి ఫస్ట్ ర్యాంక్ రావాలిరా
పరమేష్ : తప్పు చేపావు రా ...పెద్ద గొడవలో చిన్న ఛాలెంజి కాదు రా ....చిన్న గొడవలో పెద్ద ఛాలెంజి
చేసావురా నువ్వు
నేను : బాష కాదురా , భావం ముఖ్యం.
ప్రనిల్: కనీసం అన్ని subjects లో పాస్ అవుతాను అనన్నా ఛాలెంజి చేయాల్సింది ....ఫస్ట్ ర్యాంక్
అంటే ...నీ మీద నీకు చాలా నమ్మకం ఉందిరా ...
పరమేష్ : మరి ఇప్పుడు ఏం చేద్దాం రా ....
నేను : రోజు చేసేదే.....వెళ్లి దొంగ పోలీసు ఆట ఆడుకుందాం రా...
పరమేష్ : ఆది కాదురా ....నీ ఛాలెంజి మేటర్రా ....
నేను : ఆలాంటి సునితమైన విషయలు నిదానంగా నిర్ణయించుకోవాలిరా ....రేపు వచ్చేప్పుడు మీ
ఇద్దరు " rapidex 20 రోజులో ఇంగ్లీష్ " లాంటి "30 రోజులో ఫస్ట్ ర్యాంక్ " టైపు బుక్స్ ఉంటె తీసుకోని రండి ...ఏదో ఒకటి చేద్దాంలే.
              ప్రనిల్,  ఎప్పటిలాగే నువ్వే పోలీసురా ....మా ఇద్దరినీ పట్టుకోవాలి ...సరేనా .

ప్రనిల్ : లేదు రా ...ఎప్పుడు నేనే పోలీసు ఎందుకురా ....ఈసారి పంటలు వేసుకుందాం ...ఎవరు పచ్చి
           అయితే వాడే పోలీసు ....ఏమంటారు ...?
నేను : అడ పిల్లల లాగా పంటలు ఏంటి రా ..... 1 2 3 లెక్కపెడదాం 3 ఎవరు అయితే వాడు పోలీసు ..
               నేను,పరమేష్,ప్రనిల్ లైన్ లో నిలబడ్డాం..
నేను : సరే రా ....నేను లెక్కపెడుతున్నా .....నేను 1 , పరమేష్ 2 ,ప్రనిల్ 3 ..సో ప్రనిల్ నువ్వే రా పోలీసు
ప్రనిల్ : లేదు రా ...తొండి ఆట ఇది
పరమేష్: సరే ఉండు....మహేష్ నువ్వు నా place లోకి రా
పరమేష్ : ఇప్పుడు ఓకే కదా ....నేను లెక్కపెడుతున్నా... నేను 1 ,మహేష్ 2 ,ప్రనిల్ 3 ...సో ప్రనిల్ నువ్వే రా పోలీసు .
ప్రనిల్ : ఆది ఎలా రా...అంత అయోమయంగా ఉంది....ముచ్చటగా మూడోసారి...ఈసారి నేను లేక్కపెడతా .....
నేను : స్నేహితుల మీద నమ్మకం ఉండాలిరా ...ప్రనిల్...సరే ఈసారి నువ్వే లెక్కబెట్టు....3 కాదు రా ..
         ఈసారి 5 లెక్కబెట్టురా ....5 ఎవరు వస్తే వాడు పోలీసు ...సరేనా ?
            పరమేష్,మహేష్ , ప్రనిల్....ప్రస్తుతం ఉన్న లైన్
ప్రనిల్ : పరమేష్ 1 ,మహేష్ 2 ...
పరమేష్: ఆగాగు రా.....మహేష్ గాడు , నేను placeలు మారాము కదా ....నువ్వు కూడా ఒకplace మారు రా  ...లేకుంటే  మళ్లీ తొండి అంటావు ....మహేష్ నువ్వు వాడిplace లో కి వెళ్ళురా ..
ప్రనిల్ : నువ్వు ఎంత మంచి వాడివిరా  పరమేష్  ....
పరమేష్: నేను చిన్నప్పటి నుండి అంతే రా .....
          పరమేష్ ,ప్రనిల్ ,మహేష్ ....ప్రస్తుతం ఉన్న లైన్
పరమేష్ : ఇప్పుడు అంత ఓకే కదా .....లెక్కబెట్టు ఇంక
ప్రనిల్ : ఓకే రా ....ఇప్పుడు నాకు నచ్చినట్లు ఉంది... 1 పరమేష్ ,2 నేను ,3 మహేష్ ,4 పరమేష్,5 నేను :( :(
నేను: ఇప్పుడు నువ్వే చెప్పరా ....ఎవరు పోలీసు .....
ప్రనిల్ : ఎక్కడో ..ఏదో తప్పు జరిగింది కాని ....ఆది ఏంటో అర్ధం కావటం లేదురా ....సర్లే వెళ్ళండి ఇంక ...దాక్కోండి ..
పరమేష్ : అటు తిరిగి 50 లెక్కబెట్టురా ....
ప్రనిల్ : 50 అంటే కష్టంరా ...
నేను : సర్లేరా ....25 దాకా రెండు సార్లు లెక్కబెట్టు ....
ప్రనిల్ : ఇది ఓకే ....
ప్రనిల్గాడి దొంగ కౌంటింగ్ starts 1,2,5,7,8,11
నేను వెళ్లి మా ఇంటి మిద్దె పైన దాక్కుని , అక్కడ నుండి ఒంటి కన్నుతో ప్రనిల్ గాడిని గమనిస్తునాను ....
పరమేష్ గాడు కొంచెం చనువు ఎక్కువ తీసుకోని ....సీతా వాళ్ళ ఇంట్లో సోఫా వెనక్కాల దాక్కున్నాడు...
ప్రనిల్ గాడి దొంగ కౌంటింగ్ ends 23,25,49,50 ....
ప్రనిల్గాడు కౌంటింగ్ చేసి వెనకకు తిరిగే సరికి ....వాడికి సరిగా రెండింతల్లు ఉండే ఒక మనిషి
పొట్ట కనబడింది వాడికి ....ఎవ్వడురా వీడు అని తలకాయి పైకెత్తి చూస్తే వాళ్ళ నాన్న .....
వీడి 50 నెంబర్ కౌంటింగ్ చూసి , వీడికి నిజంగానే నంబర్స్ రావు అనే అనుమానం
వచ్చినట్లుఉంది వాళ్ళ నాన్నకి ...వాడి కాలర్ పట్టి లేపి ఇంట్లోకి తీసుకోని వెళ్లి,పేపర్ పెన్ ఇచ్చి 50 నంబెర్స్ 50 టైమ్స్ రాయమని చెప్పాడు

మమ్మల్నిపట్టుకోవలిసిన పోలీసునే వాళ్ళ నాన్న పట్టుకుపోతే , మమ్మల్ని ఎవ్వరుపట్టుకుంటారు అన్ని డౌట్ వచ్చి ...పరమేష్ ని అడుగుదాం అని మిద్దె పైనుండికిందకి దిగి బయటి కి వచ్చేసరికి ....
సీతా & ఫ్యామిలీ వాళ్ళ బజాజ్ స్కూటర్ మీద ఎక్కటానికి ప్రయత్నిస్తున్నారు....ఆరుగురు
ఒక స్కూటర్ అంటే impossible అనుకున్న నాకు 2 నిమిషాలు లో possible చేసి
చూపించాడు సీతా వాళ్ళ నాన్న ...."ఎక్కడికి వెళ్తున్నారు సీతా" అని అడిగాను ...
సీత: నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను కదా ....మా నాన్నగారు మాకు జెమిని circus
చూపించటానికి తీసుకోని వెళ్తున్నారు మహేష్ ...
నేను: అవునా ...నేను ఇంకా circus చేయటానికి వెళ్తున్నారు ఏమో అనుకున్నా ....
సీత : అలా ఎందుకు అనిపించింది నీకు ....
నేను : ఏమి లేదులే ....
సీత : నువ్వు చూసావా మహేష్ ...circus ?
నేను : అ ఇప్పుడు చూస్తున్నాను సీతా ...కొంచెం పౌడర్ తక్కువ అయింది సీతా నీకు ..
సీత : అయిపోయింది మహేష్ మా ఇంట్లో ....మీ ఇంట్లో ఉందా..?.
నేను : లేదు లేదు సీతా, మా ఇంట్లో నెల క్రితమే అయిపోయింది ....అయిన మా ఇంట్లో మా నాన్న ఒకడే వాడుతాడు లే....
నేను : మీ తమ్ముడు ఎక్కడా ...కనిపించటం లేదు .... మడత పెట్టి డిక్కీ లో పెట్టేసార ...?
సీతా : లేదు ...నాకు , మా అమ్మ కి మధ్య ఉన్నది వాడే కదా ....
నేను : ఏంటి మీ మధ్య ఇంకో మనిషి ఉన్నాడా.....
                            తొందరగా వెళ్ళండి  ...పాపం వాడికి గాలి  ఆడటం లేదు ...
          సీతా వాళ్ళ సర్కస్ బండి వెళ్ళాక .....అందరు  వెళ్లారు అంటే ....మా పరమేష్గాడు కూడా ఇక్కడే ఉంటాడు అని వెతకటం మొదలు పెట్టాను ....ఎంత వెతికినాదొరకలేదు ....పరమేష్ ఈ ఆట బాగా ఆడుతాడు ....
                            ఏక్కడ నుండో చిన్నగా  'ఒరేయ్, ఒరేయ్' అన్న పిలుపు వినబడుతుంది ....మాపరమేష్ గాడి మాట లాగే ఉంది ...నాకు భయం వేస్తుంది..వాడి మాట విని కాదు...అ మాట సీతా వాళ్ళ ఇంట్లో నుండి వస్తుంది కబ్బటి ....పరిగెత్తు కుంటూవెళ్లి కిటికీ లో నుండి చుస్తే లోపల పరమేష్ గడు.....బయట ప్రపంచం లో  ఏమిజరుగుతుందో ఏ మాత్రం సంబంధం లేకుండా సోఫా వెనకాల దాక్కున్న అ dedicatedఆటగాడిని చూస్తుంటే ముచ్చటేస్తోంది.
పరమేష్ : ఒరేయ్ మహేష్...లోపలికి రా రా ....ఇద్దరం కలిసి దాక్కుందాం....ఇక్కడ ఉంటె అసలు out అవ్వమురా ....
నేను : నేను రాలేను రా ....
పరమేష్ : ఎందుకురా .....out  అయవ అప్పుడే ....
నేను : నేను కాదు రా ....ప్రనిల్ గాడు , వాళ్ళ నాన్న చేతిలో out అయాడు రా ....
పరమేష్ : ఒహ్హ ...మరి ఏం చేద్దాం ....బయటికి రావాలా నేను అయితే ఇంక ....
నేను : నేను లోపలకి రాలేను ...నువ్వు బయటకు రాలేవురా ......ఫస్ట్ కిటికీ దగ్గరకి రా .....
పరమేష్ : ఏంటో....తేడాగా మాట్లాడుతున్నావ్ ....
నేను : ఏంటి రా ....కళ్ళు ఎర్రగా ఉన్నాయి ....నిద్ర పోయావా ఏంటి .....
పరమేష్ : లేదు రా ...అలా కొద్ది సేపు కళ్ళు మూసుకున్నాను రా
నేను : నీ బొంద ....చదువు కునే అప్పుడు నిద్ర పొయావు అంటే ఆది సహజం ....ఆడుకునే అప్పుడు కొడా నిద్ర ఏంటి రా ....
పరమేష్ : ఏమో రా ....అలా వచ్చేసింది .....

నేను : అ నిద్ర వల్ల , ఇపుడు నువ్వు out రా ...
పరమేష్ : ఆది ఎలారా ....
నేను : సీతా వాళ్ళు ఇంటికి తాళం వేసుకొని , సర్కస్ కి వెళ్లారు రా ....
పరమేష్ : వాళ్ళు తాళం వేసుకుంటే , నేను out ఎలా రా...
నేను : ఒరేయ్ ...కళ్ళు తెరిసి నిద్ర పోతున్నావారా ..? నువ్వు ఉన్నది వాళ్ళ ఇంట్లో నే కదా .....
పరమేష్ : అవును కదా ....ఎలారా మరి ...వామ్మో ....చీకటి పడుతుంది కూడా...
నేను : సరే రా ....bye  నేను ఇంటికి వెళ్తున్నా ...టీవీలో  చిత్రలహరి వచ్చే టైం అయింది ....
పరమేష్ : అదేంటిరా ..అలా అంటావ్ ....నన్ను ఇక్కడ ఇలా వదిలి వెళ్తావా ...
నేను : ఆట అడుతున్నాము అనుకొని , మళ్లీ   నిద్ర పోరా .....
పరమేష్ : ఇప్పుడు నిద్ర పోదాం అనుకున్నా ,రద్దు రా ...
నేను : అయిన నీకు తోడుగ ,అదిగో  వంటగది లో పిల్లి కూడా ఉంది లే....
పరమేష్ : వామ్మో .... :(

నేను:  నాకు ఎప్పటి నుండో ఒక అనుమానం రా ....పిల్లినీ ఇంట్లో పెట్టి కొడితేపులిగా మారుతుంది అంటారు ...ఎప్పుడు వినడమేగానీ చూడలేదు రా .....ఇదే సరైనసమయం.....నువ్వు దాన్ని కొట్టురా చూద్దాం ...పులిగా మారుతుందో లేదో ....ఏంభయపడకు ...నేను ఇక్కడే  ఉన్నాను...నీకు ఏమైనా అయితే వెంటనే వెళ్లి మీఇంట్లో వాళ్ళకి చెప్తాను లే .....
పరమేష్ : ఎందుకు రా ...నా జీవితంతో అడుకుంటావు ...బయటికి వచ్చే మార్గం చూడు ...
నేను : నాకు ఏంటి ....అహా నాకు ఏంటి .....అసలు నాకు ఏంటి అని..
పరమేష్ : చెప్పరా, నీ డిమాండ్స్ ఏంటో ....
నేను : నువ్వు ఎప్పుడు గోలీల ఆట లో ...నాతో ఓడిపోవాలి ..
పరమేష్ : అంతేనా .....సరే సరే ...అలాగే చేస్తా ...నేను బయటకు వచ్చే మార్గం చూడరా ....తొందరగా
నేను : ఇంకా చాలా ఉన్నాయి  ఉండు ....నువ్వు కావాలని  ఓడిపోయినా ...నాకు నువ్వు కావాలని ఓడిపోయాను అని
        చెప్పకూడదు....3rd Unit Test  లో నా కంటే తక్కువ  మార్కులు తెచ్చుకోవాలి..  
పరమేష్ : ఆది ఎలారా సాధ్యం ...నువ్వే లాస్ట్ కదా క్లాసు లో .....అందులోను హిందీ లో నీకు 0 మార్కులు ...అంతా కంటే లాస్ట్
               మార్క్ ఉండదు రా ......
నేను : అదంతా నాకు తెలియదు రా .....నా కంటే లాస్ట్ రావాలి నువ్వు  .....
పరమేష్ : అయితే కనీసం నువ్వు 1  మార్క్ అన్న తెచ్చుకో హిందీలో ....అప్పుడు నేను లాస్ట్ రాటానికి వీలు ఉంటుంది ...
నేను : సరే లే try చేస్తా ..ఎలాగోలా
పరమేష్ : అన్ని ఒప్పుకున్నా కదా ...ఇప్పుడు చెప్పు ఏంటి ప్లాన్
నేను : తాళ్ళం పగలకొట్ట కుండ , నిన్ను బయటకు తీసుకొస్తా.....కాని ఆది నీ చేతిలో నే ఉంది ...
పరమేష్: చెప్పురా ...ఏం చేయాలో
నేను : ఏమి లేదు రా .....అ వంట గది  తలుపు తీసుకోని , అ గొడ దూకి , మా మిద్దెపైనుండి రా  ....
పరమేష్ : అంతేనారా .....తలుపుల తీసి వెళ్ళిపోతే దొంగలు వస్తే .....
నేను : సరే అయితే , ఉండు అక్కడే...సీతా
వాళ్ళే  వస్తారులే ఇంకో 3 గంటలో అప్పుడు నువ్వే దొంగ అవుతావు ..
పరమేష్ : వద్దు లేరా ...వస్తున్నా ఇప్పుడే
నేను : తొందరగా రా ...ఇంకా ఆలస్యం చేస్తే , చీకట్లో నిజంగానే దొంగ అనుకుంటారు అంతా..
                              ఎలాగోలా ,తలుపు తీసి , గోడ దూకి ,మిద్దె దిగి వచ్చేసాడు పరమేష్ గాడు.......ఇంతకీ ఛాలెంజి ఏమైంది అంటే ...        
              ఓహ్  చిత్రలహరి కి టైం అయింది ....next blog లో చెప్తా ......ఛాలెంజి ఏమైందదో .....