ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 4

                                                                                                                            రచన : మహేష్
                                                                                                                            కూర్పు : శ్రీరామ్

ఇవ్వాళ మా బస్సు రాకుంటే బాగుండు అని ఇలా అనుకున్నానో లేదో,అలా మా ఎయిర్ బస్సు (మా స్కూల్ బస్సు పేరు అది) వచ్చింది.పేరుకి మాత్రం ఎయిర్ బస్సు,కాని ఎర్రబస్సు కంటే దారుణం.బస్సు ఎక్కి డ్రైవర్ పక్కన కూర్చొని ఎలా డ్రైవింగ్ చేస్తున్నాడో చూస్తూ నేర్చుకుంటున్నాను. ప్రనిల్ గాడు వాడు ఏదో విహారయాత్రకి వెళ్తున్నట్లు రోడ్ మీద వెళ్ళేవాళ్ళకి టాటా చెప్తున్నాడు.అలా మా ఎయిర్ బస్సు మేకలని వధసాలకి తీసుకెళ్ళినట్టు మమ్మలిని స్కూలుకి తీసుకువెళ్ళింది.

క్లాసు లో మా తెలుగు టీచర్,"అందరు పుస్తకాలు క్లాసు బయటపెట్టి,బెంచికి ఇద్దరు చొప్పున కూర్చోండి.పరీక్షకి ఇంకా పది నిమిషాలే ఉంది".లాస్ట్ రెండు బెంచిలలో పరమేష్,ప్రనిల్,నేను,మధు కూర్చున్నాము. ప్రనిల్ గాడు టెన్షన్ పడుతున్నాడు.

నేను :ఏరా,ఎందుకురా టెన్షన్,ముందు ఫణి ఉన్నాడు,పైన దేవుడు ఉన్నాడు.వీరిద్దరి వల్ల కాకపోతే నీ వెనకాల నేను ఎలాగో ఉన్నాను కదా...

ప్రనిల్ :ఫణిగాడు చూపించకపోతే ఎలా రా....

నేను :చూపించాల్సిన అవసరం కూడా లేదు..మీ బెంచ్ మీద సగం answers,మా బెంచ్ మీద సగం answers ముందే రాసాము కదా...అవి చూసి రాయటమే...చూసి రాయటం వస్తే చాలు రా...

ప్రనిల్ :సర్ చూస్తే రా...దొరికిపోతే

నేను : అందుకే పెన్సిల్ తో రాసాము ....సర్ చైర్ లోనుండి లేచి వచ్చేలోపే మనం చేతితో చెరిపితే చెరిగిపోతాయి....ఇప్పుడు నువ్వు ఆ ఏడుపు ఫేస్ మార్చు,లేకుంటే ఇప్పుడే దొరికేలాగా ఉన్నాం.
ఈలోపే మా సర్ "ఏంటి రా మహేష్,ఏంటి మాటలు అక్కడ...లేచి ఇలా రా నువ్వు..ఇక్కడ ఫస్ట్ బెంచ్ లో కూర్చో వచ్చి..."

నేను : సర్,అంత పని చేయకండి,ఇంక మాట్లాడను సర్...

మా సర్ :నువ్వు ఇప్పుడు వస్తావా,లేక నన్ను రమ్మంటావా అక్కడికి ....

ప్రనిల్ :ఒరేయ్,వెళ్ళరా,లేకుంటే సర్ వస్తే అందరం దొరికిపోతాం

నేను :నీకేంటి రా..ఇప్పుడు ఎన్నైనా చెప్తావు...

మా సర్ :ఏరా మహేష్ ,వస్తున్నావా లేదా....

నేను : ఆ... వస్తున్నాను సర్ .
ఫస్ట్ బెంచిలో సీత పక్కన కూర్చోబెట్టాడు మా సర్ నన్ను.....సీత నన్ను చూస్తూ ఒక వెకిలినవ్వు నవ్వింది.

సీత: ఏదైనా ప్రశ్నకి సమాదానం తెలియకపోతే అడుగు ...చూపిస్తాను

నేను :నువ్వు ఏంటి చూపించేది బోడి ...కావాలంటే నేనే నీకు చూపిస్తానులే

సీత: నీకు రావు అని కాదు కాని ...టైంకి గుర్తుకు రాకపోతే అడుగు అని నా ఉద్దేశం...

నేను :నీ ఉద్దేశాలు,ఉపన్యాసాలు నాకేమి వద్దుకాని....అంతగా నాకు రాకపోతే రాయకుండా ఖాళీ పేపర్ ఇచ్చేసి వెళ్తాను కాని నిన్ను మాత్రం అడగను......

పరీక్ష మొదలయింది.ప్రశ్నలే రెండు పేజీలు ఉన్నాయి.వీటికి జవాబులు ఎన్ని పేజీలు రాయాలో.ఆ ప్రశ్నలు చూసి నా తప్పు నేను తెలుసుకున్నాను...సీత మళ్లీ ఒకసారి అడిగితే బాగుండు..ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతా.ఏం చేయాలో తెలియక వెనక్కి తిరిగి చూశాను.అందరు ఏదో రాస్తూనే ఉన్నారు.ప్రనిల్ గాడు మాత్రం బెంచీ చూస్తూ పేపర్ మీద రాస్తున్నాడు.మనిషి అనే వాడికి ఎవడికైన అనుమానం వచ్చేలాగా చూసి రాస్తున్నాడు వాడు.మా తెలుగు సర్ చూడటానికి మనిషి లాగా లేకున్న మనిషే.అనుమానం వచ్చింది.కుర్చీ లో నుండి లేచి ప్రనిల్ వైపు వెళ్ళాడు.ప్రనిల్ గాడు ఏమాత్రం జంకకుండ,కనీసం తలెత్తి చూడకుండా బెంచీ మీద పెన్సిల్ తో రాసిన ఆన్సర్ ని పేపర్ మీద పెన్ తో రాస్తున్నాడు.

మా సర్ :ఏరా ప్రనిల్,అడీషనల్ పేపర్ ఏమైనా కావాలా రా?

ప్రనిల్ గాడు చికాకుగా తలకాయి పైకెత్తి చూసేసరికి కుర్చీ లో ఉండాల్సిన సర్,కళ్ళముందు ఉండే సరికి వాడి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

ప్రనిల్ :నాకు ఏమీ సంబందం లేదు సర్.మహేష్ గాడు మధుగాడి పెన్సిల్ తో పరమేష్ గాడి బుక్ చూసి నా బెంచ్ మీద రాసాడు .

సర్ :నువ్వు ఏం చేస్తున్నావ్ మరి.దాన్ని చూసి రాస్తున్నావా...

ప్రనిల్ :లేదు సర్ నేను రాసేది,వాళ్ళు రాసింది ఒకేలాగా ఉందో లేదో చూస్తున్నాను సర్ అంతే.

వాడు చూసి రాసినందుకు మా సర్ కి కోపం రాలేదు గాని వాడి మాటలికి కోపం వచినట్లు ఉంది.వాడి నెత్తి మీద రెండు మొట్టికాయలు వేసి మా బెంచ్ ముందు కింద కూర్చుబెట్టారు మా సర్.ఆది చూసి నాకు తెగ సంబరమేసింది.నవ్వుతూ నవ్వుతూ కింద పేపర్ చూస్తే మళ్లీ భయం మేసింది.ఏదో ఒకటి రాద్డమని పేపర్ మీద పెన్ పెట్టాను.ఆలోపే సీత అడీషనల్ కోసం అడిగింది.ఈ పిల్లని మార్చడం నావల్ల కాదు.

"పరిక్షలో బాగా మార్కులు రావాలి అంటే,భావం కాదు ఆన్సర్ షీట్స్ బరువు పెంచాలి" అని మా శ్రీరామ్ గాడి మాటలు గుర్తొచ్చాయి.ఫెయిల్ అయిన పరీక్ష కి కూడా టాపర్ కన్నా ఎక్కువ ఎడిషనల్స్ తీసుకున్న హిస్టరీ వాడిది.పేపర్ కి పైన,కింద రెండు పక్కల మూడు సెంటిమీటర్ల మార్జిన్ కొట్టాను.ఇప్పుడు రాయాలిసిన డబ్బా చిన్నగా అయింది.పేజీకి చివరిన (P.T.O)అని రాశాను.ఇప్పుడు నేను ఒక పది లైన్లు రాస్తే పేజీ నిండినట్లే.పది లైన్లు కూడా రెండు పేరాగ్రఫులు రావాలి.ఆ పది లైన్స్ ఎలాగో సీత పేపర్ లో కనబడుతూనే ఉన్నాయి.నేను ప్రనిల్ లాగా కాకుండా ఒక కన్ను నా పేపర్ మీద ఇంకొక కన్ను సీత పేపర్ మీద పెట్టి చక్కగా చిన్నగా రాశాను.

సీత: ఏంటి మహేష్,ఆన్సర్స్ గుర్తుకురావటం లేదా.చూపించాలా

నేను   : అన్ని రాశాను కానీ ఆ రెండవ ప్రశ్న గుర్తుకు రావటంలేదు సీత.నువ్వు రాసావా..
సీత : ఆ రాశాను.ఇదిగో పక్కన పెడతాను...చూసి రాసుకో....

నేను  : చూసి రాయనులే...నేను రాస్తూ..మధ్యలో ఎక్కడైనా గుర్తుకురాకపోతే అప్పుడు చూస్తాను..
సీత : ఓకే...ఐతే ఇప్పుడు వద్దు కదా..
నేను  : పర్లేదు లే...ఉంచు...మొదటి లైన్ కూడా గుర్తుకురావడం లేదు ఏంటో...

పరీక్ష అయిపోయింది.ఈ పద్ధతినే అన్ని పరీక్షలకి పెట్టాను.కాకపోతే మూడు సెంటిమీటర్లు కాకుండా ఐదు సెంటిమీటర్లు మార్జిన్ కొట్టాను .పరిక్షలు అయిపోయాయి.పరీక్షలకి పడిన కష్టం మరిచిపోయే లోపే సెలవలు అయిపోయాయి.సెలవలు తర్వాత మొదటి రోజు స్కూల్ కి వెళ్ళాలంటే భయం.ఎందుకంటే ఆరోజే ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తారు కాబట్టి.ఆ రోజు లాస్ట్ అవర్ లో క్లాస్ కి మా హెడ్ మాస్టర్ వచ్చారు ప్రోగ్రెస్ కార్డ్లు ఇవ్వడానికి.అందరి పేర్లు చదువుతూ ఇస్తున్నారు.నేను తెలివి గా బెంచ్ కింద దాక్కున్నను.రెండు సార్లు నా పేరు పిలిచారు మా హెడ్ మాస్టర్.పలకకపోయే సరికి ఆబ్సెంట్ అనుకొని పక్కన పెట్టేశారు.స్కూల్ నుండి ఇంటికి వెళ్లేసరికి ముందు గదిలో సీత కనిపించిది.స్వీట్ బాక్స్ తో....

మా నాన్న : ఏరా ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారంట కదా నీ ప్రోగ్రెస్ కార్డ్ ఏది రా...
నేను : ప్రోగ్రెస్ కార్డ్ ఆ....ఇవ్వలేదు నాన్నగారు....
సీత: ఇచ్చారు మహేష్....నువ్వు రాలేదు లాస్ట్ అవర్ లో ఇచ్చారు ...
నేను : లేదు నాన్నగారు ఇవ్వలేదు....ఈపిల్ల అన్ని అబద్దాలు చెప్తుంది...
సీత : నిజం అంకుల్...ఇచ్చారు....మహేష్ ప్రోగ్రెస్ కార్డ్ కూడా నేనే తెచ్చాను....ఇప్పుడే తెస్తాను అని పరిగెట్టుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళింది సీత...

ఛా...దొంగ పోలీస్ ఆటలో కూడా ఇంత తొందరగా నేను ఎప్పుడు దొరకలేదు.ఈలోపు ముందుగానే అనుకున్న ప్లాన్ ప్రకారం ప్రనిల్ గాడు వచ్చాడు సీన్ లోకి..మా నాన్న కి వినబడేలా

ప్రనిల్ :ఏంటి రా మహేష్...మనకి ఇవ్వాళ ప్రోగ్రెస్ కార్డు ఎందుకు ఇవ్వలేదు రా....అసలే ఈసారి చాలా బాగా రాశాము మనం పరీక్షలు....

వాడి నటన చూస్తుంటే అసలు నిజం గానే ప్రోగ్రెస్ కార్డ్లు ఇవ్వలేదు ఏమొ అనిపించెలా ఉంది...నటిస్తూ మధ్య మధ్య లో నన్ను చుస్తు కళ్ళు ఎగరేసి అ అమాయకపు మొఖాని చుస్తుంటే..చంటి సినిమా లొ వెంకటేష్ ని చుస్తున్నట్లే ఉంది.ఆ లోపే సీత వచ్చి మా నాన్న చేతిలో నా ప్రోగ్రెస్ కార్డ్ పెట్టింది .ఆ దృశ్యాన్నిచూశాక.ప్రనిల్ గాడు నా వైపు జాలిగా చూస్తూ..."ఆ అమ్మ వస్తున్నా....ఇక్కడే ఉన్నా.... మహేష్ వాళ్ళ ఇంట్లో...వస్తున్నా" అంటూ మళ్లీ నటిస్తూ వెళ్ళిపోయాడు.ఇక్కడ జరుగుతున్న అన్నిట్లో ఒక మంచి విషయం ఏమిటి అంటే ఈ సారి సీత మైసుర్ పాక్ కాకుండా జాంగిరి తీసుకొచ్చింది.

ఇంకేముంది.టేపురికార్డరు ఆన్ చేసే సమయం వచ్చింది.ఘరానా మొగుడు పాటలు రీవైండ్ అవుతున్నాయి.చాలెంజి ఏమైంది అనే కదా...అసలు మీకు మనసు లేదా...ఎప్పుడు ఏమి అడగాలో తెలియదు.వెళ్లండి మళ్లీ కలుద్దాం....
                                                                                                                                        సమాప్తం

Comments

  1. అవును.. కథ ఎండింగ్ బావుంది.. మొత్తం కథ చూస్తే సూపర్

    ReplyDelete
  2. అబ్బ, భలే రాసారు....పతాక సన్నివేశాలు తారాస్థాయికి చేరాయి....హి హి హి బావుంది, నాకు నచ్చింది :)

    ReplyDelete
  3. oye! conclude cheyyakunda samaptam antunnav enti?

    ReplyDelete
  4. Awesome, screen play adirindi, and ending super. good one. Keep it up Mahesh.

    ReplyDelete
  5. ఇంతకి మళ్ళీఎప్పుడు రమ్మంటారో చెప్పలేదు సుమి ;)

    ReplyDelete
  6. K NICE BAGUNDHI MAHESH ,POOR PROGRAESS, ANY WAY CONGRATULATION TO MAHESH CLASS ........POSITION

    ReplyDelete
  7. Excellent post nice narration.keep going.

    ReplyDelete
  8. మీ పోస్టులన్నీ ఇప్పుదే చదివాను. నాకు బుడుగు గుర్తొస్తున్నాడు. మీరు కొంచం రెగ్యులర్ గా రాయాలి. ఇలా నెలకొకటి రాస్తే ఎలా? చాలా బావున్నాయి. మీలో మంచి హస్యం ఉంది. తరువాతి టపా కోసం వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నాం.

    ReplyDelete
  9. hey funny ...but ending kooda unte baavundedhi.
    screen play adhirindhi picha navvochindhi...mee school days lo real scenesa

    ReplyDelete
  10. nice screen play...funny..
    mee real storiesa school days lo

    ReplyDelete
  11. @mahi : avunandi...kochem school days events...kochem fiction kalipi rasanuu.....

    ReplyDelete
  12. Oh wow ra..Mahesh ga...keka....
    neelo oka director ee vunnadu ra ....neekendukinka ee software kooli pani..........Cinema loo try cheyy kodadu......
    :)

    ReplyDelete
  13. boss... I am looking for the next post desperately

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 1

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 3