Posts

Showing posts from November, 2014

ప్రేమ సాగరం లో ప్రనిల్ గాడి గజ ఈత

నా నాలుగు గంటల జ్ఞాన నిద్రలోంచి తేరుకుని పక్కన ఉన్న కండక్టర్ తో "సర్, హైదరాబాద్ వచ్చిందా ?" అని    ఆత్రుతతో అడిగాను .. "హైద్రాబాద్ ఎక్కడికీ రాదు సర్, మనమే హైదరాబాద్ కి వచ్చాము అని పకపకా నవ్వేస్తున్నాడు.. "సన్ స్ట్రోక్ కంతే ఇలాంటి స్ట్రోక్ ఇచ్చే వాళ్ళకి దూరంగా ఉండాలి అనేది ప్రనిల్ గాడి దగ్గర నుండి మేము నేర్చుకున్న నీతి.. పరమేష్, ఫణి, ప్రనిల్ - స్కూల్ మేట్స్, రూం మేట్స్ రూం దగ్గరకి వచ్చేసరికి పక్కింటి పిన్నిగారితో మొగలిరేకులు సీరియల్ రేపటి ఎపిసోడ్ గురినిచి చర్చిస్తున్నాడు  ప్రనిల్. రేపటి సీరియల్ రేపే చూడాలి అని నేను, పరమేష్ రూం లోకి వచ్చేసాం. నేను :  ఏరా ప్రనిల్ , ఎలా ఉన్నావ్ రా .... వెంటనే ప్రేమ నిద్ర లో నుండి తేరుకొని .... ప్రనిల్ :  'బాగున్నాను రా ..ప్రయాణం ఎలా జరిగింది..' నేను :  బాగానే ఉంది కానీ.... ఛాన్స్ ఇస్తే కిటికిలో నుంచే వాళ్ళ ఇంట్లోకి  వెళ్ళేటట్లు   ఉన్నావ్ . ప్రనిల్ : అదేం లేదురా....సూర్య నమస్కారాలు చేస్తున్నా ....  ఇవీ  సూర్య నమస్కారాలు కాదు  ... ప్రేమ సంస్కారాలు రా ... నేను : ఇంతకీ పక్కింటి అత్తయ్య    పేరు ఏం