ఛాలెంజి..ఛాలెంజి..ఛాలెంజి..2
రచన : మహేష్ కూర్పు : శ్రీరామ్ క్లాసు లో అంతా నిశబ్దం...పరీక్షల ఫలితాలు తెలిపే రోజు....ఈసారి కూడా ఎప్పటి లాగే సీతకి , ఫణి కి గట్టి పోటి ..సీతకి తన మీద తనకి ఎంత నమ్మకం ఎక్కువ అంటే ....ఫస్ట్ రాంక్ వస్తుంది అన్న నమ్మకం తో స్వీట్ బాక్స్ కూడా తీసుకొచ్చింది పంచటానికి ....ఫణి గాడు నా పక్కన కూర్చొని maths exam లో తప్పు పెట్టిన ఒక bit question గురించే ఆలోచిస్తున్నాడు. నేను : ఏరా,ఇప్పుడు ఆలోచిస్తే ఆ 1/2 (హాఫ్) మార్క్ వస్తుందా చెప్పు....కనీసం నీకు ఏ question తప్పు పెట్టావో తెలుసు,నాకు అయితే అసలు ఏ question రైట్ పెట్టానో కూడా గుర్తులేదు.. ఫణి :నీకు ఏం తెలుసు రా...1/2(హాఫ్)మార్క్ విలువ...1/2(హాఫ్)మార్క్ తో ఫస్ట్ రాంక్ పోతుంది . నేను : నాకు కూడా తెలుసు లేరా ...1/2(హాఫ్)మార్క్ తో ఫెయిల్ కూడా అవుతాము.ఆ 1/2(హాఫ్) మార్క్ వచ్చి ఉంటే కనీసం మాథ్స్ లో అన్నా పాస్ అయ్యేవాడిని . క్లాసు లో ప్రొగ్రెస్ కార్డు ఇవ్వడానికి మా హెడ్ మాస్టర్(HM