Posts

Showing posts from March, 2010

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 3

రేపటి నుండే పరీక్షలు .... కనీసం ఈ ఒక్క సాయంత్రం అయినా చదవాలి అనే ధృడ సంకల్పం తో.... టీవీ ఆన్ చేశాను."దూరదర్శన్ కేంద్రం, హైదరాబాద్. వార్తలు చదువుతుంది శాంతిస్వరూప్, ఈనాటి ముఖ్యాంశాలు" అని శాంతిస్వరూప్ వార్తలు నిదానంగా చదవటం మొదలుపెట్టాడు. ఈ వార్తలు వింటుంటే నాకు నిద్ర వస్తుంది. టీవీ ఆఫ్ చేశాను. చదవటం అంటూ మొదలు పెడితే అదే అలవాటు అవుతుంది అని సైన్సు టెక్స్ట్ బుక్ తీశాను. "పరిసరాలు పరిశుభ్రత " పాఠం చదువుదామని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఆ పాఠం లో బొమ్మలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. చిలకమ్మ కొట్టు నుండి కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చిన మా అమ్మ, నన్ను చూసి అశ్చర్య, భయ, సంతోషాలకి లోనయింది . మా అమ్మ : ఏరా చిన్నా, పుస్తకాలతో నీకు ఏం పని రా... నేను : చదువుకుంటున్నాను అమ్మా .. మా అమ్మ : అవునా ...ఎప్పుడో చిన్నపుడు నీ విద్యాభ్యాసం అప్పుడు చూశాను పుస్తకం పట్టడం...మళ్ళీ ఇప్పుడే చూడటం కదా .... అందుకే కళ్ళలో నిరు నిండాయి... సరిగ్గా కనిపించలేదు నేను : సర్లే కానీ, ఉరికే ఇలా నన్ను మాట్లాడించకమ్మా, చదువుకుంటున్నాను ...నా కోసం ఏ వెధవ వచ్చినా నేను లేను అని చెప్పు .... వెళ్ళి హార్ల