Posts

Showing posts from 2010

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 4

                                                                                                                            రచన : మహేష్                                                                                                                             కూర్పు : శ్రీరామ్ ఇవ్వాళ మా బస్సు రాకుంటే బాగుండు అని ఇలా అనుకున్నానో లేదో,అలా మా ఎయిర్ బస్సు (మా స్కూల్ బస్సు పేరు అది) వచ్చింది.పేరుకి మాత్రం ఎయిర్ బస్సు,కాని ఎర్రబస్సు కంటే దారుణం.బస్సు ఎక్కి డ్రైవర్ పక్కన కూర్చొని ఎలా డ్రైవింగ్ చేస్తున్నాడో చూస్తూ నేర్చుకుంటున్నాను. ప్రనిల్ గాడు వాడు ఏదో విహారయాత్రకి వెళ్తున్నట్లు రోడ్ మీద వెళ్ళేవాళ్ళకి టాటా చెప్తున్నాడు.అలా మా ఎయిర్ బస్సు మేకలని వధసాలకి తీసుకెళ్ళినట్టు మమ్మలిని స్కూలుకి తీసుకువెళ్ళింది. క్లాసు లో మా తెలుగు టీచర్,"అందరు పుస్తకాలు క్లాసు బయటపెట్టి,బెంచికి ఇద్దరు చొప్పున కూర్చోండి.పరీక్షకి ఇంకా పది నిమిషాలే ఉంది".లాస్ట్ రెండు బెంచిలలో పరమేష్,ప్రనిల్,నేను,మధు కూర్చున్నాము. ప్రనిల్ గాడు టెన్షన్ పడుతున్నాడు. నేను :ఏరా,ఎందుకురా టెన్షన్,ముందు ఫణి ఉన్నాడు,పైన దేవుడు ఉ

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 3

రేపటి నుండే పరీక్షలు .... కనీసం ఈ ఒక్క సాయంత్రం అయినా చదవాలి అనే ధృడ సంకల్పం తో.... టీవీ ఆన్ చేశాను."దూరదర్శన్ కేంద్రం, హైదరాబాద్. వార్తలు చదువుతుంది శాంతిస్వరూప్, ఈనాటి ముఖ్యాంశాలు" అని శాంతిస్వరూప్ వార్తలు నిదానంగా చదవటం మొదలుపెట్టాడు. ఈ వార్తలు వింటుంటే నాకు నిద్ర వస్తుంది. టీవీ ఆఫ్ చేశాను. చదవటం అంటూ మొదలు పెడితే అదే అలవాటు అవుతుంది అని సైన్సు టెక్స్ట్ బుక్ తీశాను. "పరిసరాలు పరిశుభ్రత " పాఠం చదువుదామని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఆ పాఠం లో బొమ్మలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. చిలకమ్మ కొట్టు నుండి కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చిన మా అమ్మ, నన్ను చూసి అశ్చర్య, భయ, సంతోషాలకి లోనయింది . మా అమ్మ : ఏరా చిన్నా, పుస్తకాలతో నీకు ఏం పని రా... నేను : చదువుకుంటున్నాను అమ్మా .. మా అమ్మ : అవునా ...ఎప్పుడో చిన్నపుడు నీ విద్యాభ్యాసం అప్పుడు చూశాను పుస్తకం పట్టడం...మళ్ళీ ఇప్పుడే చూడటం కదా .... అందుకే కళ్ళలో నిరు నిండాయి... సరిగ్గా కనిపించలేదు నేను : సర్లే కానీ, ఉరికే ఇలా నన్ను మాట్లాడించకమ్మా, చదువుకుంటున్నాను ...నా కోసం ఏ వెధవ వచ్చినా నేను లేను అని చెప్పు .... వెళ్ళి హార్ల

ఛాలెంజి..ఛాలెంజి..ఛాలెంజి..2

                                                                            రచన : మహేష్                                                                               కూర్పు : శ్రీరామ్          క్లాసు లో అంతా నిశబ్దం...పరీక్షల ఫలితాలు తెలిపే రోజు....ఈసారి కూడా ఎప్పటి లాగే సీతకి , ఫణి కి గట్టి పోటి ..సీతకి తన మీద తనకి ఎంత నమ్మకం ఎక్కువ అంటే ....ఫస్ట్ రాంక్ వస్తుంది అన్న నమ్మకం తో స్వీట్ బాక్స్ కూడా తీసుకొచ్చింది పంచటానికి ....ఫణి గాడు నా పక్కన కూర్చొని maths exam లో తప్పు పెట్టిన ఒక bit question గురించే ఆలోచిస్తున్నాడు. నేను : ఏరా,ఇప్పుడు ఆలోచిస్తే ఆ 1/2 (హాఫ్) మార్క్ వస్తుందా చెప్పు....కనీసం నీకు ఏ question తప్పు పెట్టావో తెలుసు,నాకు అయితే అసలు ఏ  question రైట్ పెట్టానో కూడా గుర్తులేదు.. ఫణి :నీకు ఏం తెలుసు రా...1/2(హాఫ్)మార్క్ విలువ...1/2(హాఫ్)మార్క్ తో ఫస్ట్ రాంక్ పోతుంది . నేను : నాకు కూడా తెలుసు లేరా ...1/2(హాఫ్)మార్క్ తో ఫెయిల్ కూడా అవుతాము.ఆ 1/2(హాఫ్) మార్క్ వచ్చి ఉంటే కనీసం మాథ్స్ లో అన్నా పాస్ అయ్యేవాడిని . క్లాసు లో ప్రొగ్రెస్ కార్డు ఇవ్వడానికి మా హెడ్ మాస్టర్(HM

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 1

                                                                                        రచన : మహేష్                                                                                           కూర్పు : ఫణి  నా ఛాలెంజి విషయం అ మరుసటి రోజు జరిగే మా గ్యాంగ్ మీటింగ్ లో ప్రస్తావన కి వచ్చింది నేను,పరమేష్ ,ప్రనిల్ ఇది మా గ్యాంగ్.....ఈ గ్యాంగ్ కి లీడర్ నేనే ....ఎందుకు అంటే రోజు నా దగ్గర  2 రూపాయలు ఉంటాయి కాబట్టి! పరమేష్ వాళ్ళ ఇంటి గోడ పైన మీటింగ్ లో నేను ....... " ఏంటిరా ప్రనిల్ గాడు  ఇంకా  రాలేదు !....కొంపదీసి చదువుకుంటున్నడా  ఏంటి...?" "లేదు లేరా ...వాళ్ళ అమ్మ , వాడిని గుడ్ల కోసం చిలకమ్మ  కొట్టు కి పంపింది"  అన్నాడు పరమేష్ ... "అయితే వీడికి మళ్లీ రూపాయి లాభం అన్నమాట ..!" అంతలోనే ప్రనిల్ గాడు  పరిగెత్తుకుంటూ  వచ్చాడు...... నేను : "ఏంటి రా ...మొఖం అలా కొత్త గోలీలలాగా మెరిసిపోతోంది .....ఏంటి సంగతి  ?... పరమేష్ : వాళ్ళ నాన్న ఊర్లో లేడేమో రా ..... ప్రనిల్ : అదేం కాదు రా .....రూపాయితో లాటరీ  తీస్తే prize వచ్చింది రా ..... నేను : అవునా ....ఏం prize రా .