ఛాలెంజి..ఛాలెంజి..ఛాలెంజి..2


                                                                            రచన : మహేష్  
                                                                           కూర్పు : శ్రీరామ్ 
       
క్లాసు లో అంతా నిశబ్దం...పరీక్షల ఫలితాలు తెలిపే రోజు....ఈసారి కూడా ఎప్పటి లాగే సీతకి , ఫణి కి గట్టి పోటి ..సీతకి తన మీద తనకి ఎంత నమ్మకం ఎక్కువ అంటే ....ఫస్ట్ రాంక్ వస్తుంది అన్న నమ్మకం తో స్వీట్ బాక్స్ కూడా తీసుకొచ్చింది పంచటానికి ....ఫణి గాడు నా పక్కన కూర్చొని maths exam లో తప్పు పెట్టిన ఒక bit question గురించే ఆలోచిస్తున్నాడు.

నేను : ఏరా,ఇప్పుడు ఆలోచిస్తే ఆ 1/2 (హాఫ్) మార్క్ వస్తుందా చెప్పు....కనీసం నీకు ఏ question తప్పు పెట్టావో తెలుసు,నాకు అయితే అసలు ఏ  question రైట్ పెట్టానో కూడా గుర్తులేదు..
ఫణి :నీకు ఏం తెలుసు రా...1/2(హాఫ్)మార్క్ విలువ...1/2(హాఫ్)మార్క్ తో ఫస్ట్ రాంక్ పోతుంది .
నేను : నాకు కూడా తెలుసు లేరా ...1/2(హాఫ్)మార్క్ తో ఫెయిల్ కూడా అవుతాము.ఆ 1/2(హాఫ్) మార్క్ వచ్చి ఉంటే కనీసం మాథ్స్ లో అన్నా పాస్ అయ్యేవాడిని .
క్లాసు లో ప్రొగ్రెస్ కార్డు ఇవ్వడానికి మా హెడ్ మాస్టర్(HM) వచ్చారు....
HM :డియర్ స్టూడెంట్స్ ,ఈసారికూడా ఎప్పటి లాగే ఫణి కి,సీత కి చాలా పోటి ఉన్నది...వాళ్ళ మార్కులు
తెలుగు లో ఫణికి 92,సీతకి 92
ఇంగ్లీష్ లో ఫణి కి 94,సీతకి 94
హిందీ లో ఫణి కి 91,సీత కి 91
నేను ఫణిగాడి తో మెల్లగా : ఏంటి రా ...ఇద్దరికీ ఒకటె మార్కులు వస్తున్నాయి....ఎవరి దాంట్లో ఎవరు చూసి కాపీ కొట్టారు రా....ఇలా కాపీ కొడితే దొరికిపోతారు రా ఎప్పుడో ....
మాథ్స్ లో ఫణి కి 90 సీత కి 92
ఫణి నాతో మెల్లగా : మాథ్స్ టీచర్ వల్ల బాబాయ్ రా ...అందుకే దానికి రెండు మార్కులు ఎక్కువ వేసారు ...
సైన్సు లో ఫణి కి 92 సీతా కి 90
నేను ఫణి గాడి తొ మెల్లగా : ఏరా, సైన్సు టీచర్ మీ బాబాయ్ ఆరా ...?
ఫణి : లేదు రా ...మనకి ఎక్కువ మార్కులు వస్తే ,కష్టబడి వచ్చాయి అనుకోవాలి , పక్కన వాళ్ళకి వస్తే కాపీ కొట్టారు అనో లేక టీచర్ వాళ్ళ బాబాయ్ అనో అనుకోవాలి రా ....
ఫణి గాడి reasoning చూసి నా కళ్ళు చెమ్మ గిలాయి...
నేను : అలా అయితే , నా దృష్టిలో నేను తప్ప ,ఈ క్లాసు లో వాళ్ళు అంతా కాపీ కొట్టారు అన్నమాట...
ఫణి : నేను చెప్పింది నువ్వు కొంచెం సీరియస్ గా తీసుకున్నావు రా .....
సోషల్ లో ఫణి కి 96 సీతకి 95 1/2
నేను : ఒరేయ్ నువ్వు చెప్పిన 1/2 మార్క్ theory ఇప్పుడు practical గా చూస్తున్నాను రా ...1/2 మార్క్ తో ఫస్ట్ రాంక్ పోయేది రా ....భలె గా చెప్పావు రా ...
HM : సో డియర్ స్టూడెంట్స్ , ఈ సారి సీత కంటే ఫణి కి 1/2 ఎక్కువ వచ్చింది...ఫణి టోటల్ 555 ,సీతా టోటల్ 554 1/2 .
సీత కి కోపం వచ్చింది ,బాధ వచ్చింది , ఏడుపు కూడా వచ్చింది ....సోషల్ టీచర్ తో గొడవకి బయలుదేరింది.
మా సోషల్ టీచర్ కి చరిత్ర తో పాటు భవిష్యత్తు కూడా బాగా తెలుసునట్లు ఉంది . ముందుగానే స్టాఫ్ రూం లోపల గొళ్ళెం పెట్టుకొని , బయట  "లోపల ఎవరు లేరు" అన్నే బోర్డు కూడా పెట్టాడు
నేను : ఏం సీతా , ఎక్కడికి వెళ్తున్నావ్ ...సోషల్ టీచర్ దేగ్గరికా ...నీ answer షీట్ మళ్లీ check చేపించుకుని ఒక మార్క్ వేయించుకుంటావా ఏంటి ....
ఫణి : ఒరేయ్ దానికి లేని పోనీ ప్లాన్స్ చెప్పకు రా..ప్లీజ్
సీతా : లేదు , ఫణి answer షీట్ తీసి , తప్పులు చూపించి 1 /2 మార్క్ కట్ చేపిస్తా ......
నేను : పాజిటివ్ attitude అంటే ఇదేనేమో ....
HM : సీత , కూర్చో ...ప్రొగ్రెస్ కార్డు ఇచ్చే టైం అయింది ...
నేను : ఏరా ఫణి , ఎలాగో ప్రొగ్రెస్ కార్డ్స్ రాంక్ ప్రకారం ఇస్తారు కాబట్టి, నా కార్డు రాటానికి ఇంక చాలా టైం ఉంది కాబట్టి , నేను అలా కళ్ళు మూసుకొని , మా నాన్న సంతకం ప్రాక్టీసు చేస్తూ , మధ్య మధ్య లో నిద్ర పోతు ఉంటా ...నా కార్డు వచిన్నపుడు లేపు ...సరేనా
ఫణి : సరే రా ....ఈ సరైన నోరు మూసుకుని నిద్ర పోరా ...లేకపోతే దొరికిపోతావ్ ...
నేను: నోరు ముస్తే చాలా ..లేక కళ్ళు కూడ తెరిచి నిద్ర పోవాలా ....
HM : స్టూడెంట్స్ , ఈసారి నేరాలు ఏమో గాని ఘొరాలు మాత్రం జరిగాయి....మహేష్ స్టాండ్ అప్...
నేను : సర్ , నేను ఇంక నిద్ర కూడ పోలేదు సర్ అప్పుడే స్టాండ్ అప్ ఏంటి , మా నాన్ననే  నయం ..కనీసం తన జేబు లో  కొట్టేసిన తీసుకున్న 10 రూపాయలు గురించి 6 నెలలల తర్వాత అడుగుతాడు ..ఎంతైనా పోలీసు కదా
HM : ఆది కాదు లే కాని ...ఇదిగో నీ ప్రొగ్రెస్స్ కార్డు తీసుకో ....
నేను : అదేంటి సర్ , ఇ  సారి కొత్తగా లాస్ట్ రంక్ నుండి ఇస్తున్నారా....ఇలా అయితే ఎలా...మా ప్లాన్స్ మాకు ఉంటాయి కదా ...
HM : ఈ సారి పరిక్షలు ఎలా రాసావు రా ...
నేను : ఈ సారి కష్టబడకుండా ఇష్టబడి రాసాను సర్ ...
HM : ఈ సారి ఫస్ట్ రాంక్ నువ్వే రా .....మహేష్ ..ప్రొగ్రెస్స్ కార్డు తీసుకో ....నీ total 565 ..ఫణి గాడి కంటే 10 మార్కులు ఎక్కువ ....ఇదే ఈసారి జరిగిన ఘొరం ...
నేను : సరిగా చుడండి సర్ ....మహేష్ ఆ లేక సురేష్ ఆ ...
HM : నాకు ముందే అ  డౌట్ వచ్చి చూసాను రా ....ఏంటో నీ పేరే ఉంది రా ఇక్కడ....
నేను : ఇంక చాలు సర్ ,అయినా నాకు తెలుసు సర్ , నేను చాలా బాగా రాసాను ఈసారి పరిక్షలు ...తెలుగు పరిక్ష లో అయితే .."ఈ కింద ఇచ్చిన 5 ప్రశ్నలు లో ఏవైనా 3 ప్రశ్న సమాధానం ఇవ్వండి " అంటే నేను 5 ప్రశ్నలుకి సమాధానం ఇచ్చాను...అంతే కాదు ఇంకో ప్రశ్న కూడ నా సొంతం గా కలిపి దానికి కూడ సమాధానం ఇచ్చాను....
HM : సర్లే కాని ..ఈ సారినా సరైన ప్రొగ్రెస్ కార్డు మీద మీ నాన్న తో సంతకం పెట్టించు ...నువ్వు పెట్టకు ...
నేను : సర్ , ఎలా కనిపెట్టారు ...నేను మా నాన్న సంతకం కరెక్ట్ గానే పెట్టాను కదా ...
HM : సంతకం కరెక్ట్ గా నే పెట్టావు కాని ...అ బ్రాకెట్ లో "ఈ సంతకం పెట్టింది నేనే , మా అబ్బాయి కాదు " అన్ని రాస్తే దొరకవా మరి...
నేను : ఏంటి , అంత క్లియర్ గా ఈ సంతకం నేనే పెట్టాను , మా అబ్బాయి కాదు అని రాసిన మీకు నా మీద అనుమానం వచ్చింది అంటే , మీకు తెలుగు చదవటం రాదు అనుకుంటా....
HM : ఈ తెలివితేటలకి తక్కువ ఏం లేదు లే ....
ఈ దారుణాలు చూడలేక మా హెడ్ మాస్టర్ ,మా క్లాసు టీచర్ నీ ప్రోగేస్స్ కార్డు ఇవ్వమని వెళ్ళిపోయారు ...
నేను : ఏరా ఫణి ...మనిషికి సంకల్పం ఉండాలి గాని ,సన్ మీదకి కూడా వెల్లొచ్చు రా ....
ఫణి : theory లో కొటేషన్ కరెక్ట్ ,కాని practical లో కుదరదు అనుకుంటా రా..
నేను : నేను ఇప్పుడు theory చెప్పానా ..లేక practical గా చెప్పానా ..?
ఫణి : theory లో నే చెప్పావ్ ....
నేను : అయితే కరెక్ట్ ఎ కదా ....
ఫణి : కరెక్ట్ ఎ కాని ఇవి అన్ని నాకు ఎందుకు చెప్తునావ్ , నేను ఎందుకు వింటున్నా రా ..
నేను : ఎందుకు అంటే నేను ఇప్పుడు ఫస్ట్ రాంక్ కాబట్టి, నువ్వు సెకండ్ రాంక్ కాబట్టి ....
సీతా ,నువ్వు ఏంటి మరి స్వీట్స్ బాక్స్ కూడా తీసుకొని వచ్చావు ....నువ్వు ఫస్ట్ రాంక్ వస్తావు అనుకోవడం నీ మీద నీకు ఉన్న నమ్మకం ..వేరేవాళ్ళు కి కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని తెలుసుకో లేకపోవడం పిచ్చి అంటారు దాన్ని .....ఏం పర్లేదు లే ....ఈ నెల మీ నాన్నకి స్వీట్లు ఖర్చు, పెట్రోల్ ఖర్చు,సర్కుస్ ఖర్చు ఉండదు లే ...అ స్వీట్స్ లో ,నాకు రెండు ఇచ్చి , నా పేరు చెప్పి మిగిలిన వాళ్ళు అందరికి ఒక్కొక్కటి ఇవ్వు ....
అయినా ఫస్ట్ రాంక్ వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయటం , సెకండ్ రాంక్ వచ్చిన వాళ్ళు బాధపడటం ,లాస్ట్ రాంక్ వచ్చిన వాళ్ళు ,వాళ్ళ ప్రొగ్రెస్స్ కార్డు లో వడే సంతకం పెట్టడం మాములే ...
మధ్య లో ఎక్కడ నుంచో మా అమ్మ "ఏరా, స్కూల్ కి టైం అయింది లేరా . ఎంత సేపు నిద్రపోతావు రా !...నీకు ఇష్టం అని ఇడ్లి లోకి కారం పొడి కూడా చేశాను ...లే ..తొందరగా లేచి మొహం కడుకో ..."
అమ్మ ,ఇంకొద్ది సేపు నిద్ర పొతాను..ఇప్పుడే సీత ఏడుస్తుంది , నేను నవ్వుతున్నాను ,ఇలాంటి కలలు రోజు రావు, వచ్చినా మళ్లీ ఫస్ట్ రాంక్ రావటం అంటే కష్టం అమ్మ ....
మా నాన్న టేప్ రికార్డర్ ఆన్ చేసాడు .ఈ సరి పాటలు వినటానికే."నిన్నటిదాకా శిలనైనా,నీ పాదము సోకినే గౌతమినైనా" పాట పెట్టాడు ....దెబ్బకి లేచి కూర్చున్నాను. టేప్ రికార్డర్ నుండి వస్తున్న పాట విని కాదు ....మా నాన్న గొంతు లో నుండి వస్తున్న పాట విని...లేచి అలా నోట్లో బ్రష్ వేసి , వీధి లో కి వెళ్ళాను ..
నీళ్ళ కుళాయి దగ్గర సీత వాళ్ళ నాన్న , ఎదురింటి లక్ష్మి ఆంటీ వంతుల కోసం కొట్టుకుంటున్నారు.సీతా వల్ల నాన్న కి నోరు ఎక్కువ , లక్ష్మి ఆంటీ కి బలం ఎక్కువ .ఎవరు గెలుస్తారు అన్ని ఆసక్తి గా చూస్తున్న నాతో ఇద్దరు కలిసారు ...
ప్రనిల్ : ఏరా ..ఎవరు గెలుస్తారు అంటావ్...
పరమేష్: సీతా వల్ల నాన్న గెలవాలి అంటే ,ఇంకో ఇద్దరు మనుషులు కావాలి రా ....
నేను : ఆది సరే కాని .....మీకు ఒక విషయం చెపాలి రా ....
ప్రనిల్ : ఏంటి రా ...ఇవ్వాళ స్కూల్ లేదా .....
నేను : అది కాదు రా ....నాకు కల వచ్చింది రా ఇందాక..ఫస్ట్ రాంక్ వచ్చాను .సీత ఒకటే ఏడుస్తుంది థర్డ్ రాంక్ వచ్చింది అని.మన హం అయితే పొగుడెస్తున్నడు రా నన్ను ...
ప్రనిల్ : అయితే 600/600 తెచ్చుకొవలసింది రా ...ఎలాగో కల నే కదా
నేను : లేదు రా ...కల కూడా సహజత్వం కి దగ్గర గా ఉండాలి రా ....
పరమేష్ : అంటే , ఇప్పుడు నీకు 560/600 అంటే సహజత్వం కి దగ్గర గా ఉనట్లా ?
నేను : ఒరేయ్ పరమేష్ , తప్పు చెప్పవు రా ...560 కాదు రా ..565 మార్కులు రా ....
పరమేష్ : సహజత్వం అంటే ...నీకు 280 /600 రావాలి ..ఇది సహజత్వం అంటే ...కాని 560 అంటే !!
నేను : నీకు కుళ్ళు రా ...
ప్రనిల్ : నేను ఎన్నో రాంక్ వచ్చాను రా ....
నేను : నేను ఫస్ట్ రాంక్ వచ్చాను అంటే , నువ్వేకదా లాస్ట్ రాంక్ రా ....అన్ని subjects లో ఫెయిల్...కొంచెం చదవొచ్చు కదరా ...నా పరువు అంతా పోయింది తెలుసా....
నాకు కల్లో ఎప్పుడు రౌడిలతో చిరంజీవి లాగా fighting చేయటం,డాన్స్ వేయడం లాంటి చిన్న చిన్న కలలు తప్ప , ఇలాంటి ఫస్ట్ రంక్ రావటం లాంటి పెద్ద కల రాలేదు రా ...ఇవ్వాళ కలోకి వచ్చింది అంటే , అది నిజం గా జరగటానికి ఎంతో దూరం లేదు ...అందులోను పొద్దు పొద్దునే వచ్చే కలలు నిజం అవుతాయి అంట కదరా ...
ప్రనిల్ : అంతా అబద్దం రా ...నాకు రోజు ..ఈ రోజు సండే అన్నే కల వస్తుంది ...కాని ఏ రోజు సండే అవటం లేదు కదా ....ఒక సండే రోజు తప్ప ....
పరమేష్ : అయినా పొద్దున ఎనిమిది గంటలకి వచ్చే కలలని ,కలలు అనరు రా ..పగటి కలలు అంటారు ...
నేను : ఒరేయ్ పరమేష్ , నీకు రెండు rambo notebook stickers ఇద్దాం అనుకున్నా రా ...ఇప్పుడు ఇవ్వను ఇంక ...
మా ఇంట్లో నుండి మా అమ్మ , ఏరా ఇవ్వాళ మళ్లీ పక్క తడిపావా...లాభం లేదు నీ కోసం ప్లాస్టిక్ పట్టా కొనాలి అని వీధి లో ఉన్న అందరికి వినబడే లాగా చిన్నగా చెప్పింది...
నీళ్ళ కుళాయి దగ్గర గొడవ ఆపిమరీ జనాలు నావైపు చూస్తున్నారు,ఇంక సీత గురించి చెప్పనక్కర్లెదు ...నా ఎదురుగా వచ్చేసింది ..చేతిలో మళ్లీ స్వీట్ బాక్స్ తో ...
నేను : మా అమ్మ ఇంకా నన్ను తిట్టలేదు సీతా ...తిట్టి నప్పుడు పిలుస్తా అప్పుడు ఇద్దువు లే స్వీట్స్
        ఏంటి సీతా ఇది , ఇలాంటి నీళ్ళ కుళాయి పోటి లోకి మీ అమ్మ రావాలి గని , మీ నాన్న నీ పంపారు ఏంటి ...ఆట లో మాజా లేదు ....ఇలాంటి ఆటలో ఆడేవారు కంటే చూసే వారికే  మాజా రావాలి..మాజా రావాలి  అంటే మీ అమ్మ రావాలి ...అప్పుడు గట్టి పోటి ఉండేది ....   
సీతా : ఇవ్వాళ నా పుట్టిన రోజు మహేష్...
నేను : అవునా , ఏంటో సీతా నాకు నువ్వు ఎప్పుడు స్వీట్ బాక్స్ తో నే కనబడుతావు...చివరికి ఇవ్వాళ కల లో కుడా అలాగే కనిపించావు . ఇవ్వాళ ఎవరి ఇంటికి వెళ్ళినా , ఒక స్వీట్ తీసుకోని 10 రూపాయలు ఇస్తారు లే...పుట్టిన రోజు కదా ...సర్లే లే ..ఇంట్లోకి వెళ్లి మా అమ్మ తో నేను చెప్పాను అన్ని చేపి 15 రూపాయలు తీసుకొని , 5 రూపాయలు నువ్వు తీసుకొని , 10 రూపాయలు నాకు ఇచ్చి వెళ్ళు ...సరేనా           
ప్రనిల్ : అవును రా ...పుట్టిన రోజులు నెలకి ఒక సారైన రావాలి .
పరమేష్ : ఒరేయ్ ...పుట్టిన రోజు అంటే ఇయర్ కి ఒకసారే వస్తుంది రా ...
ప్రనిల్ : అలా అయితే , జీవితం లో నే ఒక సారి వస్తుంది రా ...ఆది మనం పుట్టిన రోజు... అ రోజు మన పుట్టిన రోజు అన్ని మనకే తెలియదు ...ఇప్పుడు మనం చేసుకునేవి అన్ని growingdays రా ...
నేను : growingdays అంటే ..?
ప్రనిల్ : మనం పెరుగుతున్న రోజులు రా ...అందుకే birth బదులు growing అని పెట్టాలి రా....
పరమేష్ , వీడిని జాగ్రతగా వాడి ఇంటి దగ్గర వదిలేసి ,నువ్వు మీ ఇంటికి వెళ్ళ రా ...ప్రనిల్, ఇంటికి వెళ్లి పాలు తాగుతూ ,horlicks తినురా ...సెట్ అవుతుంది మైండ్ ...
               నా బ్రాషింగ్ చేసి ఇంట్లో కి వెళ్ళే సరికి మా నాన్న నా కోసమే, తన "పాడుతా ఘాటుగా" ప్రోగ్రాం కి విరామం ఇచ్చరు .
మా నాన్న : ఏరా stupid ,  ఇవ్వాళ మళ్లీ పక్క తాడిపావు అంటా...ఇంకా అ అలవాటు మానవ ..
నేను : నా చేతిలో లేని వాటికీ  నేను ఏమి చేపగాలను . ఏంటో! తెలియకుండానే అల కొన్ని జరిగిపోతాయి.అయిన అమ్మ ప్లాస్టిక్ పట్టా కొంటాను అన్నది కదా ...
మా నాన్న : అలా అంటే అన్నా సిగ్గు తెచ్చుకొని  తడపకుండా ఉంటావు అని అలా చెప్పింది మీ అమ్మ 
నేను : ఇలాంటి చిన్న చిన్న సరదాలు చిన్నపుడే కదా చేయాలి ...
మా నాన్న : ఈ తెలివితేటలు చదువు లో చూపిస్తే ఎప్పుడో ఫస్ట్ రంక్ వచ్చే వాడివి .
నేను : ఫస్ట్ రాంక్ రావాలి అంటే తెలివితేటలు సరిపోవు నాన్న గారు , సీత లాగా కంటస్థం పట్టాలి.
        "నేనేమి కంటస్థం పట్టాను " అని వెనుక నుండి సీత వాయిస్ 
నేను : ఏం సీతా , నువ్వు ఇంకా వెళ్ళలేదా.నువ్వు వెళ్ళిపోయావు అనుకొని నిజం చెప్పాను...
సీతా : నిజం మహేష్ , నేను ఎప్పుడూ  కంటస్థం చెయ్యను .
నేను : సరే అయితే , సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడో చెప్పు చుద్దాం .
సీతా : తూర్పు దిక్కు 
నేను : బలే ఫాస్ట్ గా చెప్పావు సీతా ...ఇప్పుడు అదే ఫాస్ట్ లో నువ్వు నిల్చున్న ప్రదేశం నుండి తూర్ఫు దిక్కు ఎటు వైపు చెప్పవా ....
సీతా : మరి ...అది ఏమో ...అది ఏమో 
నేను : చూసావా ..నువ్వు పాఠం చదువుతావు , నేర్చుకోవు ...పర్లేదు లే  ఈ లోకం కి , మా నాన్న కి ఫస్ట్ రాంక్ ఏ important లే ....నువ్వు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు ....ఇంక చాలా మందికి స్వీట్స్ ఇవ్వాలి కదా 
సీతా : ఇందాక ఆంటీ కి స్వీట్ ఇచ్చను . ఆంటీ 10 రూపాయలు ఇవ్వడం మరిచిపోయారు.
నేను : ఉహ్హ ....ఇప్పుడు 10 రూపాయలు కోసం ధర్నా చేస్తున్నావా.
సీతా : లేదు ఎదురుచూస్తున్నా
నేను : అదేదో మేము నీకు 10 రూపాయలు బాకీ ఉనట్లు అడుగుతుంటే అనుమానం వచ్చి అడిగాను అంతే ....సర్లే మా అమ్మ ఇస్తే నీకు స్కూల్ లో ఇస్తాను లే ...వెళ్ళు మళ్లీ స్కూల్ కి లేట్ అవ్వుతుంది ....వెళ్ళే ముందు ఇంకో స్వీట్ ఇచి వెళ్ళు ....              
         సీతా తన పుట్టిన రోజు collection కోసం పక్కింటి కి వెళ్ళింది ...
         మా నాన్న  , నేను సీతనీ  అడిగిన ప్రశ్న నే ఆలోచిస్తూ 
మా నాన్న : తెలిసి చెప్పావో , అనుకోకుండా చెప్పావో గాని నిజం చెప్పావు ..ఎప్పుడూ పాఠం చదవకూడదు, నేర్చుకోవాలి.
నేను : నేను తెలిసి తెలిసి ఏ పని చేయను నాన్న గారు .ఆది పక్క తడపటం అయిన ,మాట్లాడటం అయిన ...
మా నాన్న : నీ గురించి నాకు తెలుసు కదా ... ఇంతకీ తూర్పు దిక్కు ఎటో నీకు తెలుసా ...
నేను : నాన్న గారు , ప్రశ్న అడిగిన వల్లనే మళ్లీ ప్రశ్న అడగటం అన్యాయం , అందులో మళ్లీ అదే ప్రశ్న నీ అడగటం నేరం కూడ ...            
మా నాన్న : అదంతా సరే కాని ,నీకు తూర్ఫు దిక్కు ఎటో తెలుసా ... 
నేను : ఇంత చెప్పిన మళ్లీ అడుగుతున్నారు అంటే , మీకు ఏమి అర్ధం కాలేదు అని  నాకు అర్ధంయంది . నాకు  సమాదానం తెలిసిన ప్రశ్నలు నేను ఎప్పుడు ఎవరిని అడగను నాన్న గారు ..
మా నాన్న : నాకు,నువ్వు ఏమి అర్ధం కావాలి అన్ని చెప్తునవో కాని , నాకు మాత్రం వకటి అర్ధమయింది."నీకు సమాదానం తెలియదని" , తెలియక పోతే తెలియదు అన్ని ఒప్పుకోవచ్చు కదా రా. 
నేను : ఒప్పుకోవడం , తప్పుకోవడం , తెచ్చుకోవడం  ...నాకు ,చిరంజీవి కి తెలియదు 
మా నాన్న: తప్పుకోవడం , తెచ్చుకోవడం ఏంటి రా ..
నేను : ఏదో ప్రాస కోసం నాన్న గారు ...అసలు సమాధానం తెలిసి ప్రశ్నలు అడిగే వాళ్ళని టీచర్ అంటారు ...సమాధానం తెలుసుకోటానికి ప్రశ్నలు అడిగే వాళ్ళని స్టూడెంట్స్ అంటారు ....నేను స్టూడెంట్ నీ కదా .....


        మా నాన్న ఆలోచన లో పడ్డారు ....మా ఇంటి నుండి స్కూల్ కి వెళ్ళటానికి 5 నిమిషాలు పడుతుంది కాని మా నాన్న ,ఆలోచన నుండి ఆవేశం,కోపం  లోకి మారటానికి కేవలం 2 నిమిషాలే పడుతుంది.అదేంటో ఘరానా మొగుడు పాటల  casette రివైండ్ అవ్వటానికి కూడ 2 నిమిషాలే పడుతుంది ....ఇప్పుడు రివైండ్ అవుతుంది ...ఇంక నా దగ్గర 11/2 నిమిషాలే ఉన్నాయి .....మిగతా విషయలు ఈసారి కలిసినప్పుడు చెప్తాను   
                 
          

Comments

  1. చాలా చాలా బావుంది...

    ReplyDelete
  2. చాల బాగుంది. very intellectual and funny play. అసలు మహేష్ కి ఫస్ట్ రంక్ ఎలా వస్తుందా అని వాళ్ళ నాన్న తో చాలేంజే చేసినప్పటి నుండి అలోచిస్తుంటీ చాల funny గ చాల interesting గ చివరి వరకు చదివేల వుంది ఈ బ్లాగ్ keep it up Mahesh, అసలు నువ్వు కాదు నేనే కొడత ఎవరైనా నిన్ను కవి ని కాదు అంటీ..

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 4

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 1

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 3