సమరానికి సై ...place నువ్వు చెప్పిన సరే ...నన్ను చెప్పమన్నా సరే

                                                                                                                       కూర్పు : శ్రీరామ్ 

ప్రదేశం      : ఖమ్మం                                                                                                       
సమయం   : బస్టాండ్ లో పొద్దున్నే న్యూస్ పేపర్స్ వేసే వేళ 
                        
నేను కూడా ఇంజినీరింగ్ తర్వాత  IAS, IPS లాంటివి కాకుండా , అందరి లాగే  డిఫరెంట్  గా ఆలోచించి సాఫ్టువేరు  ఉద్యోగం  కొసం హైదరాబాద్ వెళ్ళటానికి ఖమ్మం బస్టాండ్ లో , టికెట్ కౌంటర్ లైన్ లో నిల్చున్నాను.      
          
                       "సర్,హైదరాబాద్ కి టికెట్ ఒకటి  ఇవ్వండి."
                       "ఇంతకీ ఏ బస్సు సర్ అని  అడిగాను."
                       "...అదిగో అక్కడ కనబడే ఆ  లగ్సరి  బస్సు అని  చెప్పబోయే లోపే నేను అందుకొని ..."
                      "అయిన 100 రూపాయల్లో  హైదరాబాద్ కి లగ్సరి  బస్సు అయితే APSRTC  నష్టాల్లో  ఉండక ఇంక ఎలా అనుకునే లోపే ఈసారి వాడు  అందుకొని "
                       "...."హలో సర్ , ఆ  లగ్సరి  బస్సువెళ్లిపోయాక  అక్కడికి ఒక  ఎర్ర బస్సు వస్తుంది అదే మీ బస్సు...."  

అయినా  నేను బస్సుల రంగులు పట్టించుకోను.10  నిమిషాల్లో  బస్సు రానే  వచ్చింది.జనాలు లేకపోయినా  అలవాటు గా బయట నుండే ఫ్రంట్ సీట్ లో కర్చీఫ్  వేసి బస్సు ఎక్కి కూర్చున్నాను.
ఎలాగైనా హైదరాబాద్ లో సాఫ్టువేరు జాబ్  సంపాదించే దాక మళ్ళీ  ఖమ్మం రాను అని ఎవరికి చెప్పాలో  తెలియక  బస్సు డ్రైవర్ కి ఛాలెంజ్ చేశాను.ఆతను మాత్రం నన్ను ఏదోలా చూసాడు..మరీ  తొందర పడ్డాను ఏమో కదా...అంటే మధ్య మధ్యలో  పెళ్ళిలకి పండగలకి వస్తాను లెండి.ఈ బలమైన నిర్ణయం వెనక ఒక గతం ఉంది.అది చెప్పే ధైర్యం నాకు ఉంది..వినే ఓపిక మీకు ఉండే ఉంటుంది లెండి..చెప్తాను వినండి.

పొద్దున్నే అమ్మ వేసిన సాంబ్రాణి  పొగ ఇల్లంతా  నిండుకొని ....కళ్ళు తెరిచి ఈ  రోజుకి ప్రపంచాన్ని మొదటి సారి  చూస్తున్న నాకు సాంబ్రాణి  మబ్బుల్లో కాళ్ళకి పట్టీలు, పట్టు లంగాలో,చేతికి నిండుగా గాజులు వేసుకొని... అదేదో దేవకన్య నన్ను పెళ్ళి చేసుకోటాని పరిగెత్తుక్కుంటూ వస్తునట్లు ఉంది ...ఆ  సిగ్గుతో అలా తల తిప్పేసరికి....మా నాన్న నా వైపు చూస్తూ  రోజూ లాగే తనలో తాను ఏదో మాట్లాడుకుంటునాడు...

మెల్లగా అలా  మంచం పైనుంచి లేచి బ్రష్ చేస్తూ నా కోసం వచ్చిన దేవకన్య పారిపోకుండా తలుపు వేద్దామని ముందు గది లోకి వచ్చాను... అపుడు తెలిసింది వచ్చింది దేవకన్య కాదని  దయ్యంపిల్ల అని...ఇంకెవరు మా సీత.... చేతి నిండా సేమ్యా,పులిహోర గిన్నెలతో మా మీద ఏదో ప్రయోగం చేయటానికి వచ్చినట్లు ఉంది. 

     ఏంటి సీత...పొద్దున్నే దుకాణం తెరిచేసావ్...ఏంటి స్పెషల్...మీ నాన్నగారి ఉద్యోగం  పోయిందా ఏంటి..అయినా నాకు ఎపుడో తెలుసు...మీ ఫ్యామిలీ సర్కస్ కి తప్ప సర్వీస్ కి పనికిరాదు.

సీత :అదేం కాదు మహేష్...నాకు టి.సి.ఎస్ కంపెనీ లో జాబు వచ్చింది.
ఒక్కసారిగా  నోట్లో ఉన్న పేస్టు నురుగు గొంతులోకి వెళ్లి పోయింది
సీత :ఆంటీ,అంకుల్ ఉన్నారా...నా గుడ్ న్యూస్ వాళ్ళకి చెప్పాలి
పొద్దున్నే నన్ను మా నాన్న చేత తిట్లు తినిపియకుండా నీకు నిద్ర పట్టదా..పో తల్లి పో...

ఆలోపే మా నాన్నగారు రానే వచ్చారు

మానాన్న :ఏంటి సీత స్పెషల్ నీ పుట్టినరోజా ఏమైనా.మహాలక్ష్మి లాగా ఉన్నావ్ తల్లి ..

సీత :లేదు అంకుల్..నాకు ఉద్యోగం వచ్చింది.అందుకే స్వీట్స్.                

ఆ అమ్మ పిలిచావా అంటూ వంట గదిలోకి  వెళ్దాం అనుకునే లోపే మా అమ్మ కూడా వచ్చేసింది.

నేను ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ గెలిచి వచ్చినా ఇంత సంతోషపడరు కానీ సీత కి ఏదో చిన్న ఉద్యోగం అనేసరికి వీళ్ళ సంతోషానికి హద్దు లేకుండా పోయింది..

        అయినా ఇంత చిన్న వయసు లో ఉద్యోగం  ఏంటి అని నాకు నేను ధైర్యం  చెప్పుకున్నాను.


సీత వెళ్తూ వెళ్తూ వెనకకి తిరిగి మా కాలనీ అంత వినిపించేలా,అంకుల్ నా జీతం చెప్పలేదు కదా..నెలకు 20వేలు అని మండుతున్న అగ్నిగుండం లో ఒక లారీడు  పెట్రొలు పోసి వెళ్ళింది ...ఇవ్వాల్టికి  హాయిగా నిద్ర పోతుంది ఇక.
               
         ఇదే ఇదే  రగులుతున్న  అగ్నిపర్వతం అని  కృష్ణ పాట నా ఒక్కడికే  వినిపిస్తుంది ..

ఏరా వెదవ   అ అమ్మాయిని చూసి నేర్చుకోరా... నీతో పాటే  చదివింది కదా చిన్నప్పటి నుండి..
సిగ్గు లేదా రా...నీకంటే నీరు(మా కుక్కపిల్ల పేరు ) నయం..రాత్రి కాపలా అన్నా ఉంటుంది

కానీ  మా నాన్నకి ఏం తెలుసు...అది మా కంటే మొద్దు నిద్ర పోతుంది రాత్రి వేళ.. మా నాన్న వచ్చేసరికి నటించేస్తుంటుంది.... దానికి అన్ని కుక్క బుద్దులే...

నువ్వు హైదరాబాద్ వెళ్తావా లేదా....నువ్వు వెళ్ళకుంటే నేనే తోసేస్తాను బయటికి అని ఇంకా చాలానే  తిట్టారు లెండి.మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తునట్లు ఉన్నారు నన్ను తిడుతుంటే....
                        
ఇదంతా చూస్తున్న  మా కుక్క(నీరు) పిల్లి గంతులు వేస్తుంది.ఈ ప్రపంచం లో నన్ను మా నాన్న తిడ్తుంటే సంతోషించేది ఒకటి సీత..రెండు  ఇదిగో ఈ కుక్క ...నేను భయపడేది కూడా ఈ ఇద్దరికే ... ఒకటి కట్టివేసిలేకుంటే దీనికి....లేకుంటే సీతకి..మా కుక్కకి కూడా అర్ధమైనట్లు ఉంది నేను హైదరాబాద్ వెళ్తున్నానని...      
అయినా ఈ  సాఫ్టువేరు కంపెనీలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నాయి....అవి అందంగా ఉండటానికి అమ్మాయిల్ని..దిష్టి కొట్టకుండా ఉండటానికి అబ్బాయిలని తీసుకుంటూ ఉంటుంది...లేకుంటే ఏంటి మనం 10 కి 10 కరెక్ట్ ఆన్సర్స్ చేసినా మనల్ని  తీసుకోరు...అదే అమ్మాయిలు 5 రాంగ్ రాసినా ఆన్సర్ షీట్ ని ఇంటికి తిసుకెళ్ళి చెరిపేసి కరెక్ట్ ఆన్సర్స్ రాసి మరీ సెలెక్ట్ చేస్తారు...ఇది పబ్లిక్ టాక్ అంతే.ఈ సెంటిమెంట్ తో నాకు సంబంధం లేదండోయ్.
                   
ఇక లాభం లేదు...హైదరాబాద్ ప్రయాణానికి  సిద్దం కావాలి...వస్తునాను నేను వస్తున్నాను కాచుకో అని  తొడ  కొడదామంటే  వాతావరణం లో వర్షం వచ్చే లాగా లేదు.... ఉరుములు  మెరుపులు ఉంటే  కదా ఫీల్ వచ్చేది...
                                     
                                   అందుకే ఎవరు ఏమి అనుకున్నా....టైం ఎనిమిది అవుతున్నా  టిఫిను పెట్టని మా అమ్మ మీద అలిగి ఇప్పటికి మాత్రం సీత  తెచ్చిన  వేడి వేడి సేమ్య తినేద్దాం అని  డిసైడ్ అయ్యా...అది కూడా మా నీరు కి ఊరిస్తూ..తర్వాత జాబు గురించి అలోచిద్దాం  చిన్నగా...
       
మళ్ళీ  కలుద్దాం  హైదరాబాద్ లో ....సిద్దంగా ఉండండి ఇక. 

Comments

Post a Comment

Popular posts from this blog

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 4

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 1

ప్రేమ సాగరం లో ప్రనిల్ గాడి గజ ఈత