ప్రేమ సాగరం లో ప్రనిల్ గాడి గజ ఈత


నా నాలుగు గంటల జ్ఞాన నిద్రలోంచి తేరుకుని పక్కన ఉన్న కండక్టర్ తో "సర్, హైదరాబాద్ వచ్చిందా ?" అని    ఆత్రుతతో అడిగాను .. "హైద్రాబాద్ ఎక్కడికీ రాదు సర్, మనమే హైదరాబాద్ కి వచ్చాము అని పకపకా నవ్వేస్తున్నాడు.. "సన్ స్ట్రోక్ కంతే ఇలాంటి స్ట్రోక్ ఇచ్చే వాళ్ళకి దూరంగా ఉండాలి అనేది ప్రనిల్ గాడి దగ్గర నుండి మేము నేర్చుకున్న నీతి..
పరమేష్, ఫణి, ప్రనిల్ - స్కూల్ మేట్స్, రూం మేట్స్

రూం దగ్గరకి వచ్చేసరికి పక్కింటి పిన్నిగారితో మొగలిరేకులు సీరియల్ రేపటి ఎపిసోడ్ గురినిచి చర్చిస్తున్నాడు 
ప్రనిల్. రేపటి సీరియల్ రేపే చూడాలి అని నేను, పరమేష్ రూం లోకి వచ్చేసాం.

నేను :  ఏరా ప్రనిల్ , ఎలా ఉన్నావ్ రా .... వెంటనే ప్రేమ నిద్ర లో నుండి తేరుకొని ....

ప్రనిల్ :  'బాగున్నాను రా ..ప్రయాణం ఎలా జరిగింది..'

నేను :  బాగానే ఉంది కానీ.... ఛాన్స్ ఇస్తే కిటికిలో నుంచే వాళ్ళ ఇంట్లోకి  వెళ్ళేటట్లు   ఉన్నావ్ .

ప్రనిల్ : అదేం లేదురా....సూర్య నమస్కారాలు చేస్తున్నా .... 

ఇవీ  సూర్య నమస్కారాలు కాదు  ... ప్రేమ సంస్కారాలు రా ...

నేను : ఇంతకీ పక్కింటి అత్తయ్య    పేరు ఏంటి మామా ?

ప్రనిల్ : ఏమో , వాళ్ళ అమ్మ పేరు కనుక్కోలేదు.....అయినా  ప్రేమ కి పేరెంట్స్  తో పని లేదు కదా .. 

నేను : వీడికి పిచ్చి తగ్గలేదు,  బుర్రా   పెరగలేదు ....నేను అడిగింది   నీ లవ్ పేరు రా ....

ప్రనిల్ : సిగ్గు లాంటి ఏదో ఎక్స్ప్రెషన్ తో   'రోజా'  ....నాకు ఉద్యోగం వచ్చాక  పెళ్లి చేసుకుందాం  అనుకుంటున్నాను .

నేను : లేదు మామ ...ఈ  రోజుల్లో  ముందే ప్రపోస్  చేయాలి ... కాంపిటీషన్  కదా...

ప్రనిల్ : పెళ్లి వయసు  దాటి  ఏడు సంవత్సరాలు  అయింది ...దాన్ని  ఎవడు చేసుకుంటాడు రా ఇప్పుడు ..

           నేనే దిక్కు 

నేను : ఓహో ....అదీ  వీడి ధైర్యం అన్నమాట ....తెలిసి అన్నాడో , తెలియక అన్నాడో కానీ ఆ అమ్మాయిని చూడాలి

          అని ఉన్న తపన పారిపోయింది....ఇంతకీ రోజా  అత్తయ్య కి పెళ్లి ఎందుకు కుదరటం లేదు రా ...

ప్రనిల్ : ఏం లేదు రా ...ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు ఎవడో రాగింగ్  చేసాడని   యాసిడ్  పోసింది  వాడి 

           మొహం మీద....ఈ  పిచ్చి జనాలకి అది సెల్ఫ్ సెల్ఫ్ డిఫెన్స్  అని  అర్ధం కాక  ఎవడూ రావటం లేదు రా పెళ్లి 

           చేసుకోటానికి .... 

నేను : లోలోపల  "రూం లో మొదటి రోజే ....రూం పక్కన ఒక  పిచ్చిది ఉంటుంది అనే  నిజం తెలిసింది"        ...ఏరా ప్రనిల్      
          ఈ కిటికీ మనం క్లోజ్ చేసే ఉంచుదాం  ....నిన్ను పిలవటానికి ఎపుడైన   సరదాగా  యాసిడ్  పోస్తే 
           మా మొకాలు  కాలిపోతాయి కదరా...అప్పుడు అది self defense కాదు రా ...attempt to murder

          అవుతుంది ...        



                            రూంలో ఏదో పెద్ద శబ్దం  . ఎవరైనా మా మీద బాంబు దాడి చేస్తున్నారేమో అనిపించిది . తీరా  చూస్తే ఒక పేపర్  weight కి పేపర్ చుట్టి బాగా బరువైన సందేశం పంపించినట్లుoది రోజా  

నేను : వామ్మో ఇంకా నయం నేను కిటికీ పక్కన లేను .. ప్రేమ సందేశాలకి పిల్లలని  , పావురాలని  వాడుతారని

తెలుసు కానీ ఇలా పేపర్ వెయిట్  చూడటం ఇదే ఫస్ట్ టైం రా 

ప్రనిల్ : మా ప్రేమ బాగా బరువయినది అని తన ఫీలింగ్ .. ఏంటో తనకి నేనంటే ఇంత పిచ్చి

ఫణి : అవును అవు ను లాస్ట్ చెప్పింది కరెక్ట్ ... పిచ్చే

పరమేష్ : అది సరే కాని ముందు ఆ  లెటర్ ఏంటో చూడు

నేను : రక్తంతో రాసి ఉంటుంది ఏమోరా  ,,నీ కోసం

ప్రనిల్ : లేదు .... ప్రేమ తో రాసిoది రా  ...

"హాయ్ నేస్తం ...నీ  అంతరాత్మని  అర్ధం  చేసుకోడానికి ఈ  ఆత్మ  ఇందిరా  పార్క్  లో   రేపు   సాయంత్రం  5 గంటలకి వెయిట్ చేస్తూంటుంది...."     

ఈ  ఆత్మల గోల ఏంటిరా ...మనుషుల్లా  మాట్లాడుకోవచ్చు  కదా

ప్రనిల్ : ఒరేయ్ మీరు నాకు హెల్ప్ చేయాలి ... రాక రాక వచ్చిన ఈ  అవకాశంతో నా లైఫ్ మారిపోవాలి

కొత్తగా మారేది ఏముంటుంది ఉన్న భయంకరం నుండి బీభత్సం  అవతుంది. ఇంతకి మేమేమి చేయాలి రా

ప్రనిల్ : మంచిగా ప్లాన్ చేయండి రా ...ఈ ప్రేమ సాగరం లో నా మాటల వల లో  అ చిన్న చేప  పడాల్సిందే  .

ఫణి : చిన్న చేప కాదు  సొర చేప ... అయినా  ఇలా నాన్ వెజిటేరియన్ జోకులు వేస్తే వెజిటేరియన్ వాళ్ళకు

         నచ్చవ్ .... చేపలూ రొయ్యలు  ఎందుకు చెప్పు


వీడి మాటలు వింటుంటే పులిబోను లోకి వెళ్ళటానికి చిట్టెలుక శాయక్తులా ప్రయత్నిస్తున్నట్లుంది
ఇక్కడ విచిత్రం ఏమిటంటే ... చిట్టెలుక వస్తుందని పులికి తెలుసు ...చూస్తున్న మాకు తెలుసు ...ఒక చిట్టెలుకకి మాత్రం తెలియటంలేదు 
ETV లో నేరాలు  ఘోరాలు చూస్తూ ఈ దారుణాలకి ప్రిపేర్ అవుతున్నాం

ఫణి : ఒరేయ్ ఒకటి చెప్తా విను ...మధ్యాహ్నం  ట్యాంక్ బండ్ కి వెళ్తే ఆ  నీరు తప్ప బుద్ధుడు  మీదికి వెళ్ళదు చూపు.అదే అర్ధరాత్రి వెళ్తే ఒక బుద్ధుడు  తప్ప ఏమీ  చూడం .... ఏదైనా  మనం ఎదుటి వాళ్ళని చూసే టైం బట్టి  ఉంటుందిరా

ప్రనిల్ : అయితే నేను ఇప్పుడు రోజా ని ఏ  టైం కి కలవమంటున్నావ్ రా .... అర్ధ రాత్రి కలిస్తే బాగుంటుందంటావా

నేను : ఒరేయ్ ఫణి ... LKG చదివేవాడికి O అంటే ఆరంజ్  అని చెప్పాలి కానీ ఓంకార్ అన్నయ్య  గురించి చెప్తే ఏం అర్ధమవ్తుంది రా ... చూడు ఇప్పుడు వీడు అర్ధ రాత్రి  వెళ్లి రోజా ని కలిసినా  కలుస్తాడు 

అప్పటికే సమయం రాత్రి 9 అవతుంది . అది  వేసవి కాలం కాబట్టి  అందరం మిద్ద పైనే నిద్రపోతున్నాము 

పరమేష్ : పదండి రా ....మిద్దె మీదకి  వెళ్దాం

ప్రనిల్ గాడి పంట పండింది ....ఎందుకంటే రోజు వాళ్ళు కూడా మా మిద్దె మీదకే వస్తారు నిద్రపోటానికి ...

చల్లని గాలి ...చిన్ని చిన్ని చుక్కలు చూడ చక్కని చంద్రుడు ....ఇలాంటి ప్లెసెంట్  క్లైమేట్ ని వైలెంట్  చేయటానికి

వచ్చింది రోజా ....కొరివి దయ్యానికి కాష్మోరాకి క్రాస్ బ్రీడ్ లా , మేకప్ లేని హీరోయిన్ల  ఉంది ఈ పిల్ల ...

పెద్దలు ఊరికే అనలేదు ప్రేమ గుడ్డిది అని

చేతిలో కత్తి తో వచ్చింది రోజా ... ఇంకో చేతిలో ఆపిల్ ఉందిలెండి ...
 ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సముద్రం లో సునామి వచ్చినట్లు, ప్రనిల్  గాడు పాట అందుకున్నాడు ..

జాబిలమ్మ  నీకు అంత కోపమా .. ప్రనిల్ గాడి మీద  జాలి  చూపుమా  అని రోజా ని కొంటె చూపు  చూస్తూ  మొదలుపెట్టాడు 
వీడి పాటకి అప్పటిదాకా గుక్క పట్టి ఏడుస్తున్న పక్కింటి పాప తను చేసింది అంత పెద్ద తప్ప అని  ఏడుపు  ఆపేసింది ...పాపం  ఈ  జన్మలో మళ్ళీ ఏడ్వదు  ....
మిద్దె మీద పడుకుందాం అని వచ్చిన మా ఓనర్ వాళ్ళ కుక్క కూడా గబగబ కిందకి పరుగులు తీసింది ...

ప్రనిల్ గాడి  పాట వింటే ఎవరికైనా  చావాలి లేక చంపాలి అనిపిస్తుంది

వీడి పాట తో రోజాకి లేని కోపం వచినట్లు ఉంది ... ప్రనిల్ గాడి మీదికి ఆపిల్ విసిరేసింది .
వీడికి అది తన పాట కి బహుమతిలా  అనిపించింది ...ఇంకో  పాట అందుకున్నాడు ..

పరమేష్ : ఒరేయ్ నా ఎడమ కన్ను అదురుతుంది రా .. ఆపరా  ప్రనిల్


హలో గురూ ...ప్రెమ కోసమే రా జీవితం .... మొగాడితో ఆడదానికేలా పౌరుషం ....
అలా  సగం తిని ఆపిల్ మళ్ళీ  రోజా మీదికి  విసిరాడు

రోజాకి పౌరుషం వచిన్నట్లు ఉంది ... అర నిమిషంలో  100 మీటర్ల దూరం వచ్చి చేతిలో కత్తి  ఉన్నా, తన దయా  హృదయంతో చాచి పెట్టి ఇచ్చింది  ప్రనిల్ కి...

ఆ దెబ్బ కి ... ఆకాశం లో ఉండవలిసిన చుక్కలు ప్రనిల్ గాడి కళ్ళ ముందుకి వచ్చేసాయి .....చంద్రుడు ఒక మేఘాన్ని  వెతుక్కొని దాక్కున్నాడు ...
జనాలందరూ ఆ  శబ్దానికి యుగాంతం  వచ్చిందనుకొని  కిందికి పరుగులు తీస్తున్నారు ...
అంత దెబ్బ కొట్టి మళ్లీ సరసం అంటున్నది రోజా ...

చాచి  కొట్టి  సరసం అంటుంది ఏంటి రా .. రేపు మర్డర్ చేసి మురిపెం  అంటుందా
పరమేష్ గాడి  ఫోన్ మోగుతుంది  ... చుక్కలోకెక్కినాడు చక్కనోడు ...ఎప్పటికీ  ఎవ్వరికీ చిక్కనోడు ...
 రోజా ఇపుడు మా ముగ్గురి వైపు కోపంగా చూస్తున్నది ..
మరీ  అమ్మాయిల  చేతిలో దెబ్బలు తినేంత వెధవలు  కాము  మేము ...

ఒంటి నిండా బలాన్ని ..గుండె నిండా ధైర్యాన్ని  నింపుకొని భయంతో  శ్రీరామ్ గాడి   రూం వైపు  పరుగులు తీసాము

ఎందుకంటే మా రూం కీస్ ప్రనిల్ గాడి దగ్గర ఉన్నాయి .. అంత సాహసం చేయటం  కంటే పరుగు పందెం మంచిది అని అలా మా ప్రయాణం మొదలు పెట్టాము ...

                                                ఇంకేం చూస్తున్నారు మళ్ళి కలుద్దాం అసలే బోలెడు దూరం వెళ్ళాలి ..  

Comments

Popular posts from this blog

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 4

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 1